37.2 C
Hyderabad
May 1, 2024 11: 27 AM
Slider ప్రత్యేకం

స్పీడ్ గన్ తో ఫొటోలు తీస్తున్న కానిస్టేబుల్ ను అడ్డుకున్న వ్యక్తిపై క్రిమినల్ కేసు

#speedgun

విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీసు కానిస్టేబుల్ ను అవమానించిన ఒక వ్యక్తిపై నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీశైలం జాతీయ రహదారిపై చెట్లలో దాచుకొని స్పీడ్ గన్ తో ఫోటోలు తీసి ఫైన్ లు వేస్తున్నారని, పోలీసులు ఇలా దొంగచాటుగా ఫొటోలు తీయడం ఏమిటని ఒక వ్యక్తి ఆ పని చేస్తున్న నాగర్ కర్నుల్ జిల్లా వెల్దండ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన పోలీసు కానిస్టేబుల్ మల్లయ్య ను, ఉన్నతాధికారులను, పోలీస్ డిపారట్మెంట్ ను, ప్రభుత్వాన్ని అంతిరెడ్డి అరవింద రెడ్డి అనే వ్యక్తి దూషిస్తూ వీడియో తీశాడు.

ఈ వీడియోను నిన్న రాష్ట్రం లోని అన్ని వాట్సప్ గ్రూపు లలో వీడియో క్లిప్పింగ్ వైరల్ చేశాడు. అతి వేగంగా వెళ్లే వాహనాలను గుర్తించి వారు ఆ విధంగా మళ్లీ చేయకుండా ఉండేదుకు స్పీడ్ గన్ తో ఫొటోలు తీసి సంబంధిత వాహనదారుడికి జరిమానా విధిస్తారు. తద్వారా జరిమానా పొందిన వ్యక్తి ఆ తర్వాతి కాలంలో అతి వేగంగా వాహనాన్ని నడపకుండా ఉంటాడు. అతివేగం అత్యంత ప్రమాదకరమైనది కావడం వల్ల పోలీసు శాఖ ఈ విధంగా చేస్తుంటుంది. చెట్ల చాటు నుండి స్పీడ్ గన్ ఉపయోగించడం తప్పు కాదు.

ఇది ప్రజా శ్రేయస్సు దృష్ట్యా చేసిన డ్యూటీ. చట్టాలను అమలు చేయుట పోలీసుల విధి. చట్టాలను పాటించడం ప్రజల కర్తవ్యం. ఈ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కు ఆటంకం కలిగించిన అంతిరెడ్డి అరవింద రెడ్డి పై వెల్డండ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఎస్పీ నగర్ కర్నూల్ తరపున అదనపు జిల్లా ఎస్పి సిహెచ్ రామేశ్వర్ తెలిపారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పి తెలిపారు.

Related posts

రైల్లోంచి దూకేసిన ప్రేమజంట

Murali Krishna

పలకని ఫోన్లతో జగనన్నకు ఎలా చెబుతాం?

Satyam NEWS

హుజూర్ నగర్ పట్టణ బైతుల్ మాల్ నూతన కమిటీ ఎన్నిక

Bhavani

Leave a Comment