40.2 C
Hyderabad
May 5, 2024 19: 03 PM
Slider వరంగల్

వ్యవసాయ రుణాలు రాని ములుగు జిల్లా రైతులు

#Mulugu Farmers

ఎమ్మార్వో సర్టిఫై చేసిన పహాణి నకల్ ఆధారంగా రైతు లకు పంట రుణాలు ఇవ్వాలని ములుగు జిల్లా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సీపీఎం ఆధ్వర్యంలోని రైతు సంఘం సంబంధిత అధికారులకు వినతి పత్రం సమర్పించింది. ములుగు మండలం లోని జంగాలపల్లి ఆంధ్ర బ్యాంక్ పరిధిలో 9 గ్రామపంచాయతీ పరిధిలో 5000 లకు పైగా రైతులు క్రాపు లోన్లు కోసం దరఖాస్తు చేసుకున్నారు.

అయితే పట్టా 1 బి ఉంటే నే క్రాప్ లోన్లు ఇస్తాం అని బ్యాంకు అధికారులు అంటున్నారు. అయితే తొంబై శాతం మంది రైతు లకు పట్టా లు పూర్తి గా రాలేదు. దీంతో యాభై శాతం మంది వ్యవసాయ ఋణం ఇప్పటి వరకు పొందలేదు.

రైతు లు ఇబ్బంది పడుతున్న విషయం పై తెలంగాణ రైతు సంఘ ములుగు మండల నాయకులు నాగంపల్లి బాబు, సీపీఎం నాయకులు గుండెబోయిన రవి గౌడ్ ల ఆధ్వర్యంలో మేనేజర్ లాలు, జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్యామల రమేష్, రవికుమార్, ఈక రామయ్య, విజయ, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాలేజీ నుంచి రోడ్డుపైకి వచ్చి యువతి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

కరోనా కారణంగా వేములవాడ ఆలయం మూసివేత

Satyam NEWS

ప్లాస్టిక్ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత: మున్సిపల్ కమిషనర్ రాజయ్య

Satyam NEWS

Leave a Comment