కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజన అనంతరం తీవ్ర అస్వస్థకు గురికావడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాదాపు రెండు గంటల పాటు విద్యార్థులు తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నప్పటికీ ఆస్పత్రిలో సిబ్బంది వైద్యులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు గంటల అనంతరం వైద్యులు వచ్చి ప్రథమ చికిత్స చేపట్టారు. విషయం తెలుసుకున్న బిచ్కుంద ఎంపిపి అశోక్ పటేల్ విద్యార్థులకు పరామర్శించారు. గురుకులంలో ఎప్పుడో సరైన భోజనం ఉండదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. వివరాలు ఉదయం అల్పాహారం అనంతరం తొమ్మిది గంటల ప్రాంతంలో ఐరన్ మాత్రలు ఇచ్చారని పలువురు విద్యార్థులు అన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం తరువాత తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో విద్యార్థులు పాఠశాల ప్రిన్సిపల్కు సమాచారం ఇచ్చారు. దీంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకొచ్చారు రెండు గంటల నుండి ఆస్పత్రిలో విద్యార్థులు బాధపడ్డ వైద్యులు సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
previous post