40.2 C
Hyderabad
May 2, 2024 15: 38 PM
Slider కవి ప్రపంచం

చైత్రోదయం

#PattemVasantha

పాత పేజీలు తిరగేసి

కొత్త పుటలకు ఆరంభం

వసంతరుతువు ఆగమనంతో

చైత్రోదయపు తొలి పొద్దుతో

నులి వెచ్చని కిరణాల స్పర్శతో

ప్రకృతి పులకించి పోగా

లేత చిగురులు తొడిగిన

చిగురు పచ్చని ఆశలతో

యుగానికి ఆదియైన ఉగాదితో

తెలుగువారి నూతనవత్సరమై

కోకిలమ్మ కుహూ అనే కూతలతో

వేప పూతచేదు ,మామిడి ఓగరు

చింతపండు పులుపు ,మిరియకారం

చెరుకుగడలతీపి షడ్రుచుల కలబోత

మానవజీవితాల్లో సుఖదుఃఖాల

మేళవింపులు మిళితమైన బంధాలు

మనసు నిండా కోర్కెల దండలే

రాశి ఫలాలు, పంచాంగ శ్రవణాలు

ఆదాయ వ్యయాలను బేరీజు వేస్తూ

శార్వరిలో వణికించిన కరోన్మాదం

అంతమై  ప్లవనామకు సుస్వాగతం…

పత్తెం వసంత

Related posts

న్యాయమూర్తులపై వ్యాఖ్యలు చేసిన రాజశేఖరరెడ్డి అరెస్టు

Satyam NEWS

గిద్దలూరు లో పసికందును వదిలేసి వెళ్లిన తల్లి

Bhavani

రాజ్ ఘాట్ వద్ద టిడిపి ఎంపిల మౌనదీక్ష

Satyam NEWS

Leave a Comment