40.2 C
Hyderabad
May 6, 2024 18: 52 PM
Slider ముఖ్యంశాలు

జగనన్న ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలి

#CPI

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రకటించిన నవరత్నాల్లో భాగంగా రాష్ట్రంలో ‘అందరికీ ఇళ్ళు’ పేరుతో నిర్మాణం చేపట్టిన జగనన్న కాలనీల అవసరమైన నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెంచి సరిపడా డబ్బులు ఇవ్వకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను ఏమాత్రం కల్పించకుండా అబద్దాలు ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతున్నారు కాబట్టి సిపిఐ నేతృత్వంలో చేపట్టిన ఉద్యమానికి సంఘీభావంగా ధర్నాలో సీపీఎం, తెలుగుదేశం, ఆమ్ ఆద్మీ, లోక్ సత్తా, జనసేన పార్టీల నేతలు దుయ్యబట్టారు.

ఈ మేరకు విజయనగరం జిల్లా కలెక్టరేట్ దగ్గర సిపిఐ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు కె. దయనంద్, లోక్ సత్తా జిల్లా నాయకులు రాజారావు, జనసేన పార్టీ జిల్లా నాయకులు త్యాడ రామకృష్ణ లు మాట్లాడుతూ నిర్మాణ సామగ్రి సిమెంట్, స్టీల్, ఇటుకలు, ఇసుక, కంకర, కిటికీలు, తలుపుల మొదలైన ధరలు కూలీల రేట్లు కూడా విపరీతంగా పెరిగిన ధరలకు అనుగుణంగా జగనన్న

ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న 1 లక్ష 80 వేలను 5 లక్షలకు పెంచాలని, టిడ్కో ఇళ్ళను లబ్ధిదారులకు తక్షణం స్వాధీనం చేయాలని, రోడ్లు, కాలువలు, విద్యుత్తు లైట్లు, మంచినీటి పైపు లైన్లు వేసి కుళాయి కనెక్షన్లు లాంటి మౌళిక సదుపాయాలు కల్పించాలని సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న పోరాటంలో మా పార్టీలు కూడా భాగస్వామ్యం అవుతాయన్నారు. రాష్ట్రంలో ఒక తుగ్లక్ పాలన సాగుతోందన్నారు. రానున్న ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని

ఓడిపోతామెమో అని భయంతో గడప గడప కి వైసిపి అని ఎమ్మెల్యేలు 4 ఏళ్ళకి మిమ్మల్ని కలిసి అన్ని పథకాలు అందుతున్నాయా అని అడుగటానికి వస్తున్నారని అన్నారు. అర్హులందరకు ఇళ్ళు ఇచ్చేసామని అని అబద్దాలు ప్రచారాలు చేసుకుంటున్న నాయకులను మాకు మీ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు 45 గజాలు ఒక కుటుంబానికి ఏ మేరకు సరిపోతాయని నిలదీసి అడగాలన్నారు. మీరిచ్చిన 1 లక్షా 80 వేల రూపాయలు పెరిగిన ధరలతో సరిపోతాయా అని ప్రశ్నించాలని అన్నారు. డబ్బులు కట్టిన మాకు టిడ్కో ఇళ్ళను ఎప్పుడు అప్పగిస్తారని నిలదీయాలని అన్నారు.

జగన్మోహన్ రెడ్డి పాలనలో చిత్తశుద్ధి ఉంటే జగన్నన్న కొలనీల్లో లబ్ధిదారులకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు కేటాయించి పక్క రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా నిర్మాణపు ఖర్చు 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే మీరు 3 సార్లు ఇచ్చిన మాట తప్పారని ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే మాట తప్పిన ముఖ్యమంత్రిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారని నేతలు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్సులు బుగత అశోక్, అలమండ ఆనందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు మద్ది కృష్ణ, ఎస్.రంగరాజు, కోట అప్పన్న, ఎన్. నాగభూషణం బాయి రమణమ్మ, బుగత పావని, జిల్లా సమితి సభ్యులు పొందూరు అప్పలరాజు, ఎస్.సునీల్, కె.భీముడు, మధు, స్వామి, అప్పలరాజు, డేగల అప్పలరాజు, పురం అప్పారావు, మునకాల శ్రీను, టి.ఎండుదొర, కాళ్ళ కృష్ణ, షేక్ చంద్ బీబీ, లలిత, శారద, లెంక లక్ష్మీ, పొడుగు అశోక్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం.. దిష్ఠిబొమ్మ దహనం

Sub Editor

విజయనగరం జిల్లా స్థాయ ఉద్యోగుల క్రీడా పోటీల‌ల్లో..పౌర సంబంధాల స‌మాచార శాఖ

Satyam NEWS

వైజాగ్ లో రాజధాని పెట్టేదీ మేము కట్టిందే కదా?

Satyam NEWS

Leave a Comment