29.7 C
Hyderabad
April 29, 2024 10: 32 AM
Slider ముఖ్యంశాలు

ప్రజారంజక బడ్జెట్

#ajay

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ రూ.2,90,396 కోట్ల బడ్జెట్‌ను ప్ర‌వేశ‌ పెట్టడం పట్ల రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌ అన్ని వర్గాల సంక్షేమంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాలకు భారీగా నిధులు కేటాయించి ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచిందంటూ కొనియాడారు.   తెలంగాణ బడ్జెట్ దేశానికి మోడల్‌గా నిలుస్తూ, మహిళలు ఆర్థికంగా మరింత ప్రగతి సాధించేందుకు బడ్జెట్‌లో పెద్దపీట వేయడం సంతోషకరమని, దళితులు, మైనారిటీల భద్రత, సంక్షేమం, అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంకితభావంతో ముందుకు సాగుతున్నారని చెప్పడానికి ఈ బడ్జెట్ నిదర్శనమని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు.సమస్త వర్గాల ప్రయోజనాలను పరిరక్షించే సమగ్ర బడ్జెట్ అని,అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది అని మంత్రి అజయ్ కుమార్ అన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని, ఈ ఆర్థిక సంవత్సరంలోనే సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కరువు పీడత ప్రాంతాలకు నీళ్లు ఇస్తామని ఎన్ఎస్పి లో నీటి లభ్యత ఉండని సమయాల్లో ఆయకట్టును స్థిరీకరించడం కోసం పాలేరు రిజర్వాయర్ కు అనుసంధానం చేసి రెండు పంటలను పక్కాగా పండించుకునే అవకాశం ఖమ్మం జిల్లా ప్రజలకు రాబోతుంది అని మంత్రి పువ్వాడ ఆశాభావం వ్యక్తం చేశారు.అదేవిధంగా భూమి ఉన్న వారికి ఇండ్ల నిర్మాణం కోసం ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున 7,890 కోట్లు బడ్జెట్ లో పెట్టారు అని వివరించారు.

Related posts

కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి

Satyam NEWS

షట్ అప్: సంస్కారం లేదా గాజులు తొడుక్కోలేదిక్కడ

Satyam NEWS

వనపర్తి ఆర్డీవో కార్యాలయ భవనం రికార్డుల నిర్వహణను ప్రారంభించిన మంత్రి

Satyam NEWS

Leave a Comment