38.2 C
Hyderabad
April 29, 2024 14: 45 PM
Slider హైదరాబాద్

మేం పాఠాలు చెప్పం… ఆ విషయం బయటకు తెలిస్తే ఊరుకోం

#sivarampally

అదేదో ఇండియా పాకిస్తాన్ బోర్డర్ కాదు… చైనా సైనిక శిబిరమూ కాదు… దేశ భద్రతకు ముప్పువాటిల్లే ప్రదేశమూ కాదు… ఒక ప్రభుత్వ పాఠశాల. అందులో రహస్యాలు ఏముంటాయి?… పాఠశాలలో రహస్యాలు ఏముంటాయో తెలియదు కానీ ఆ స్కూల్ ఉపాధ్యాయుడు మాత్రం ఆ స్కూల్ లోని విషయాలు బయటకు రాకుండా కాపలా కాస్తున్నట్లున్నాడు.

అందేంటి పాఠశాలలో టీచర్లు పాఠాలు కదా చెప్పాల్సింది….. కాపలా కాయడం ఏమిటి అనుకుంటున్నారా? ఇదే విషయం బయటకు రాకుండా ఆయన కాపలా కాస్తున్నాడు. నిజంగా పాఠాలు చెప్పే టీచర్లకు కోపం రాలేదు కానీ మొగులయ్య అనే టీచర్ కు మాత్రం విలేకరులు వెళ్లి పాఠశాలలో ఫొటోలు తీస్తుంటే కోపం వచ్చింది.

ఎవరు నీవు… ఎవరి అనుమతి తీసుకోని మా పాఠశాల లోకి వచ్చి ఫొటోస్ తీస్తున్నావ్ అంటూ  శివరాం పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో విధులు నిర్వహించే మొగులయ్య అనే ఉపాధ్యాయుడు విలేఖరిని భేదిరించిన సంఘటన సోమవారం చోటు చేసుకోంది. నేను పేపర్ విలేఖరి ని గుర్తు పట్టారా అని సమాధానం ఇస్తే నీ ముఖం పై ఏమైనా రాసిందా అంటూ తన చేతిలోని ఫోన్ తీసి విలేకరి ని ఫోటో తీసాడు.

విద్యార్థులకు పాఠాలు భోదించకుండా పాఠశాల ఆవరణలో విద్యార్థులతో ముచ్చటిస్తూ కాలక్షేపం చేస్తుండగా పాఠశాల ప్రారంభం మొదటి రోజు కావడం తో  విద్యార్థుల ఫోటో తీస్తుండగా అయన  విలేఖరి పై నిప్పులు చేరిగారు. ఎవరి అనుమతి తో ఫోటో తీసావ్ అంటూ ఫోన్ లాక్కొ పోయాడు. మొదటి రోజు పాఠశాల ప్రారంభం కావడం తో పరిస్థితి ఎలా ఉంది, విద్యార్థులు పూర్తి స్తాయి లో హాజరు అయ్యారా, బడి బాట నిర్వహించారా, ఇంకా ఏమైనా సమస్య ఏర్పడ్డాయా అని న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన విలేఖరి తాను ఉపాధ్యాయున్ని అనే సోయి లేకుండా ఆఫీస్ లోకి నడువు అంటూ చేతి పట్టుకొని లాగాడు.

ఎన్నో సమస్యలు పరిష్కరించి విలేకరి పైనే టీచర్ దౌర్జన్యం

దీన్ని గమనించిన ఇతర ఉపాధ్యాయులు వచ్చి ఇతను విలేకరే, మన స్కూల్ సమస్య ల పరిష్కారం లో తన పాత్ర పోషిస్తూ వస్తున్నాడు. పోనీ సార్ అంటూ సర్థి చెప్పినా తన భాషా విధానం, ఆగ్రహం తగ్గించుకుండా మొగులయ్య మాట్లాడాడు. విద్యార్థుల కు పాఠాలు భోదించకుండా ఆవరణలో ముచ్చటిస్తూ ఉన్న ఫోటో తీయటమే తప్పయింది అన్నట్లుగా వ్యవహారించాడు.

పాఠశాల లోకి ఎవరు వచ్చిన అనుమతి తీసుకుని రావాలి అంటూ చెప్పుకొచ్చాడు. నీవు ఏమి రాసుకొంటావో రాసుకుపో మీ విలేఖరులు నీతి మంతులు, నీవో సత్యాహరిచంద్రుడవు అంటూ ఆవేశం తో ఊగి పోయారు.  వేసవి సెలవులు అయిపోయాక కూడా మొగులయ్య లాంటి ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు భోదించకుండా టైం పాస్ కు పాఠశాలకు రావడం, పోవడం తప్పా తమ నిర్వహించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  విలేఖరులను కించ పరుస్తూ మాట్లాడిన ఉపాధ్యాయుడిపై ఉన్నతాధికారు లు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే టీచర్ల మొత్తానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది.

Related posts

ఆకాశమంత

Satyam NEWS

బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధికి రూ.772 కోట్లు మంజూరు

Satyam NEWS

జగన్ మూడేళ్ల పాలనలో నకిలీ రత్నాలుగా మారిన నవరత్నాలు

Satyam NEWS

Leave a Comment