29.7 C
Hyderabad
May 3, 2024 03: 44 AM
Slider నెల్లూరు

పంటకు నీరివ్వలేని ఎమ్మెల్యే అవసరమా?

#mla

నెర్రెలు చీలిన పొలాలను పరిశీలించిన వర్ల కుమార్ రాజా

రైతులకు నీరివ్వలేని ప్రభుత్వం, ఎమ్మెల్యేలు ఉండి ఏం లాభమని తెలుగుదేశం పార్టీ పామర్రు ఇంఛార్జి వర్ల కుమార్ రాజా నిలదీశారు. పొట్టదశలో ఉండే పంటకు నీరు లేక, నేల నెర్రెలు చీలుతుంటే రైతులు కన్నీరు పెట్టుకునే దయనీయ స్థితికి ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అసమర్ధతే కారణమన్నారు. పెదపారుపూడి మండలం మోపర్రు గ్రామంలో నెర్రెలు చీలిన పంట పొలాలను పరిశీలించారు. కంకులు పడే సమయంలో నీరు లేకపోవడంతో పొలాలు ఎండిపోయి, రైతులు కన్నీరు పెడుతుంటే ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు. మూడు రోజుల్లో నీరిస్తామని చెప్పిన ఎమ్మెల్యే ఎక్కడున్నాడని ప్రశ్నించారు. ఎమ్మెల్యేకి ఇసుక, మట్టి మాఫియాలతో జేబులు నింపుకోవడంపై ఉండే శ్రద్ధ ప్రజలపై లేదు. తక్షణమే పొలాలకు నీరిచ్చే ప్రయత్నం  చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు ఉజ్జినేని అనిల్, జూపల్లి రాజేష్, నాగినేని కార్తీక్, జూపల్లి రవిశంకర్, జూపల్లి చిట్టిబాబు, వంగ నాగరాజు, నాగినేని వంశి, నాగినేని కోటేశ్వరరావు, వంగ పవన్, వంగ చైతన్య, నాగినేని రామకృష్ణ, కాసారపు శ్రీనివాసరావు,కలపాల కిషోర్ స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

కొత్త సంవత్సరంలో తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ వరాలు

Satyam NEWS

జర్నలిస్టులపై ప్రభుత్వ అఘాయిత్యాలను అడ్డుకుంటాం

Satyam NEWS

సర్పంచ్‌లకు వై ఎస్ జగన్ ప్రభుత్వం ‘స్వాతంత్య్ర’ ఝలక్

Satyam NEWS

Leave a Comment