38.2 C
Hyderabad
May 1, 2024 21: 56 PM
Slider కవి ప్రపంచం

ఆత్మీయ బంధం

#Puli Jamuna New

తరువు ప్రకృతి పచ్చదనానికి నిదర్శనమై

గలగల పారే జలసిరులకు ఆదెరువవుతుంది

ప్రతిఫలాపేక్ష లేకుండానే  ఫలాల నందిస్తూ

త్యాగ గుణంతో ఆకలిని తీర్చే  అన్నపూర్ణవుతుంది

మండుటెండలో అలసిన జీవులకు

చలువ పందిరై సేదతీర్చే నేస్తమవుతుంది

పెరిగే ఉష్ణోగ్రతలకు చెట్ల పెంపకమే

శీతల లేపనమై ఆదుకునే హస్తమవుతుంది

ప్రకృతి అసమతౌల్యతను నిరోధించి

పచ్చలతోరణమై చెట్టు ఆయువుపట్టవుతుంది

సంప్రదాయ వన మూలికలకు మూలమై

ఆరోగ్యాన్నందించే ఔషధమవుతుంది

కాలుష్యాన్ని తరిమి వేసి సర్వజీవులకు

స్వచ్ఛమైన గాలినందించే ప్రాణదీపమవుతుంది

సామాజిక స్పృహతో వృక్షాలను సంరక్షిస్తేనే

భవిష్యత్తరాలకు రక్షణనందించే కల్పతరువవుతుంది

తరువు మానవ మనుగడకు మూలాధారమై

అనునిత్యం పెనవేసుకున్న బంధమవుతుంది

పులి జమున, మహబూబ్ నగర్, 8500169682

Related posts

ఆదర్శం: విద్యార్ధుల్ని దత్తత తీసుకున్న తెలుగుదేశం నేతలు

Satyam NEWS

తొలి సారి…ఏజన్సీ ఏరియాలో పర్యటించిన విజయనగరం లేడీ ఎస్పీ

Satyam NEWS

వేములవాడ రాజన్నను మోసం చేసిన కేసీఆర్

Satyam NEWS

Leave a Comment