40.2 C
Hyderabad
April 29, 2024 16: 29 PM
Slider ముఖ్యంశాలు

జర్నలిస్టులపై ప్రభుత్వ అఘాయిత్యాలను అడ్డుకుంటాం

#journalist raghu

జర్నలిస్టులపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దాడులను, జర్నలిస్టులను అణచివేసేందుకు చేస్తున్న కుట్రను సమర్ధంగా ఎదుర్కొంటామని తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అనంచిన్న వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ అన్నారు.

తొలివెలుగు జర్నలిస్ట్ రఘు బెయిల్ పై విడుదల అయిన సందర్భంగా వారు మాట్లాడారు. ఈ నెల 3వ తేదీన మార్కెట్‌లో పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఇంటి నుండి వెళ్ళిన రఘును గుండాలో, పోలీసులో తెలియని కొందరు వ్యక్తులు వెంబడించి బలవంతంగా కిడ్నాప్ చేసి కారులో తీసుకు వెళ్లిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత పోలీసులు కుట్ర పూరితంగా రఘు అరెస్ట్ చూపించి జైలుకు తరలించారు. 13 రోజుల తరువాత రఘు బెయిల్ పై మంగళవారం విడుదల అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అనంచిన్న వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ తదితరులు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకొని రఘుకు స్వాగతం పలికారు.

మొదట్లో రఘును ఎవరు తీసుకు వెళ్లారో.. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియకపోవడంతో జర్నలిస్టులు, కుటుంబ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెందారని, ఆ తరువాత సూర్యాపేట జిల్లా గుర్రంపోడు భూముల వ్యవహారంలో బాధితుల పక్షాన నిలిచి జర్నలిస్టుగా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడమే రఘు చేసిన నేరమనుకుంటే చట్టపరంగా అరెస్ట్ చేయాల్సి ఉండేదనివారన్నారు.

రఘుకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అసలు వచ్చిన వారు పోలీసులా లేక ప్రైవేట్ గుండాలా అనేది తెలియకుండా మఫ్టీలో వచ్చి బజారులో అందరూ చూస్తుండగా బలవంతంగా ఎత్తుకెళ్లిన దృశ్యాలకు సంబంధించిన ఫుటేజీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయని పేర్కొన్నారు.

గుర్రంపోడు భూముల విషయంలో రఘుపై మోపిన కేసులు అక్రమమైనవనీ జర్నలిస్టుపై తప్పుడు కేసులు పెట్టి కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం కూడా ఇవ్వకుండా తీసుకెళ్లడం సరికాదన్నారు. అన్యాయంగా అక్రమంగా రఘును అరెస్ట్ చేసి మానవ హక్కులకు విఘాతం కల్పించారని ఫైరయ్యారు.

రఘు అక్రమ అరెస్ట్ రాష్ట్రంలో జర్నలిస్టులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నదని.. రఘు అక్రమ అరెస్ట్ వ్యవహారంపై మానవహక్కులను ఉల్లంఘించిన పోలీసులపై విచారణ జరిపించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Related posts

హైకోర్టుకు క్షమాపణలు చెప్పిన జగన్ ప్రభుత్వం…..

Satyam NEWS

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన చీఫ్ సెక్రటరీ SK జోషి

Satyam NEWS

రమేశ్ హాస్పిటల్స్ పై చర్యలకు ఐఎంఏ అభ్యంతరం

Satyam NEWS

Leave a Comment