35.2 C
Hyderabad
April 27, 2024 13: 24 PM
Slider నిజామాబాద్

బిచ్కుందలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు

#valmiki

మహర్షి వాల్మీకి జీవితం మానవాళికి ఆదర్శమని బిచ్కుంద ముదిరాజ్ సంఘం సభ్యులు అన్నారు. శనివారం మండల కేంద్రంలో గల వాల్మీకి మహర్షి ఆలయంవద్ద ముదిరాజ్  సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ పురోహితుడు దత్తు పంతులు ఆధ్వర్యంలో ఉదయం నుండి ఆలయంలో అభిషేకాలు,ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అశోక్ పటేల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాల్చర్ రాజు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగ ఎంపిపి అశోక్ పటేల్ మాట్లాడుతూ వాల్మీకి మహర్షి జీవితం మానవులకు ఆదర్శప్రాయమని, ఆయన జీవితాన్ని ముందు తరాలకు తెలియజేయాలని, కృషి ఉంటే మనుషులు మహర్షులవుతారని, వాల్మీకి మహర్షి చరిత్ర ఇందుకు నిలువెత్తు నిదర్శనమని వివరించారు.ఆలయ ప్రాంగణం లో మహా అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో అశోక్ పటేల్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాల్చర్ రాజు,మండల బారాసా అధ్యక్షుడు వెంకట్ రావు  దేశాయ్,ఎంపీడీవో ఆనంద్, మహబూబ్, ఉప సర్పంచ్ నాగరాజు, డాక్టర్ రాజు, సంజు పటేల్, మార్కేట్ కమిటీ చైర్మన్ నాగ్నాథ్ పటేల్,ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు  బుర్రే వార్ సాయిరాం,ఉపాధ్యక్షుడు ఎడ్గి రమేష్,కార్యదర్శి సచిన్,లంకల పవన్,ముదిరాజ్ సంఘ సభ్యులు కప్ప గణేష్,గోపి బషెట్టి, బసన్ బోయిన హన్మండ్లు,దుబ్బ సాయిలు,మాడ రాములు,హోటల్ కాషిరాం,దుబ్బ గోపాల్, తౌటి సాయిలు, యూత్ అధ్యక్షుడు పుట్ట విఠల్,బంటు విఠల్,నాగరాజ్(నవత),పిట్ల సాయిలు,తదితరులు పాల్గొన్నారు.  గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

జీ లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

కేసీఆర్ కుమార్తె కవిత అలిగి అమెరికా వెళ్లిందా

Satyam NEWS

నెఫ్ట్ ద్వారా ఇక 24 గంటలూ నగదు బదిలీ చేసుకోవచ్చు

Satyam NEWS

అస్పృశ్యత, అంటరానితనం, రెండు గ్లాసుల విధానంపై పోరాటం…!

Satyam NEWS

Leave a Comment