దేశ జనాభాలోనే కాకుండా తెలంగాణలో కూడా12% శాతం ఉన్న సంచార జాతులకు చెందిన వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లో జరిగిన సంచర జాతుల సమావేశం డిమాండ్ చేసింది.
జాతీయ సంచర జాతుల ప్రధాన కార్యదర్శి, ఎడ్వకేట్ గుండ్లపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1700 వందల సంచర జాతుల కులాలను ఆర్ధికంగా, విద్యాపరంగా ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వారి పిల్లలకు ప్రత్యేక పాఠశాలలు, హాస్టళ్లు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయంగా కూడా వీరికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి వారిని రాజకీయంగా కూడా ఎదిగేందుకు తోడ్పడాలని ఆయన కోరారు.
తెలంగాణలో జనవరి 2020 జరగబోయే పురపాలక ఎన్నికల్లో సంచర జాతుల అభ్యర్దులకు అన్ని పార్టీలు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. ఈ సమావేశం లోసంచర జాతుల ప్రతినిధులు పసుపులేటి కరుణాకర్, రామలింగం ప్రసాద్, భాస్కర్, వెంకట్ ,రవీందర్ పాల్గొన్నారు.