33.7 C
Hyderabad
April 29, 2024 00: 53 AM
Slider ప్రపంచం

క్షిపణి దాడులు ఆపని ఉత్తర కొరియా

#northkorea

దక్షిణ కొరియా, అమెరికాలు గట్టి సమాధానం ఇచ్చినా ఉత్తరకొరియా స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం ఆపడంలేదు. ఉత్తర కొరియా గురువారం జపాన్ దిశలో రెండు స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను సముద్రంలోకి మళ్లీ ప్రయోగించడంతో ఉద్రిక్తత నెలకొంది.

ఈ క్షిపణి ప్రయోగం 12 రోజుల్లో ఆరవది. ఉత్తర కొరియా ఈ పరీక్షలు కేవలం “దక్షిణ కొరియా-యుఎస్ జాయింట్ డ్రిల్స్‌పై కొరియన్ పీపుల్స్ ఆర్మీ ప్రతిఘటన చర్యలు” అని ప్యోంగ్యాంగ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. జపాన్ ప్రభుత్వం కూడా ప్రయోగాన్ని ధృవీకరించింది. దీన్ని తాము ఖండిస్తున్నామని జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా విలేకరులతో చెప్పారు.

జపాన్ రక్షణ మంత్రి యసుకాజు హమదా కథనం ప్రకారం, మొదటి క్షిపణి గురువారం గరిష్టంగా 100 కిలోమీటర్ల ఎత్తులో ప్రయోగించగా రెండోది 350 కిలోమీటర్లు, మూడవ క్షిపణి సుమారు 50 కిలోమీటర్ల ఎత్తులో, నాలుగవది 800 కిలోమీటర్ల విమాన పరిధిని కలిగి ఉంది. ఉత్తర కొరియా ఇటీవలి ప్రయోగించిన స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు (SRBM) అడ్డగించే యత్నాలను క్లిష్టతరం చేసే విధంగా రూపొందించబడ్డాయని ఆయన చెప్పారు. ఉత్తర కొరియా ఈ సంవత్సరం దాదాపు 40 క్షిపణులను ప్రయోగించింది.

ఇది జనవరిలో కొత్త “హైపర్సోనిక్ క్షిపణి”ని ప్రారంభించడంతో మొదలైంది. ఆ తర్వాత దీర్ఘ శ్రేణి క్రూయిజ్ క్షిపణులను చేర్చింది. 2017లో మొదటి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ICBM) ప్రయోగించారు. ఉత్తర కొరియా అణు పరీక్షను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందని అమెరికా అభిప్రాయపడుతున్నది.

Related posts

పేదల కాలనీలు పట్టించుకోని బాగ్ అంబర్ పేట్ కార్పొరేటర్

Satyam NEWS

ఆర్యన్‌ఖాన్‌ చుట్టూ ఉచ్చు.. మూడ్రోజుల కస్టడీ.. మరో ఇద్దరి అరెస్ట్..

Sub Editor

డుయూనో:హిందువులంతా గర్జిస్తే ఏంజరుగుతుందో తెలుసా

Satyam NEWS

Leave a Comment