27.7 C
Hyderabad
May 7, 2024 09: 51 AM
Slider ప్రపంచం

జపాన్ జలాల్లోకి ఉత్తర కొరియా బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగం

అణ్వాయుధాలు, క్షిపణి పరీక్షలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఉత్తర కొరియా.. తాజాగా మరో క్షిపణిని పరీక్షించినట్లు తెలుస్తోంది. దేశ తూర్పు తీరం నుంచి కనీసం ఒక బాలిస్టిక్‌ మిస్సైల్‌ను ఉత్తర కొరియా పేల్చిందని దక్షిణ కొరియా, జపాన్‌ తెలిపాయి. భారీ ఆయుధాలు, అణు కార్యకలాపాల ప్రతిష్ఠంభనపై చర్చించేందుకు నిఘా అధిపతులతో చర్చలకు దక్షిణ కొరియా సిద్ధమవుతున్న వేళ ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

కాగా, నార్త్ ప్రయోగించిన క్షిపణి జపాన్‌ జలాలకు సమీపంగా పడటంతో జపాన్ హెచ్చరికలు జారీ చేసింది.
మరో వైపు రెండు బాలిస్టిక్‌ మిస్సైల్స్‌ను తాము గుర్తించామని జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిడా తెలిపారు. గడిచిన కొన్ని వారాలుగా ఉత్తర కొరియా అనేక మిస్సైల్‌ పరీక్షలు చేపట్టిందని, ఇది క్షమార్హం కాదని తెలిపారు.

Related posts

రాజంపేట మునిసిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు…

Satyam NEWS

స్వామీ అయ్యప్పా ఈ వివాదాలు నిన్ను ఆపగలవా?

Satyam NEWS

పారిశ్రామిక కారిడార్ ల పనులు తక్షణమే చేపట్టండి

Satyam NEWS

Leave a Comment