34.2 C
Hyderabad
May 11, 2024 21: 54 PM
Slider వరంగల్

జగ్జీవన్‌రామ్‌ జీవితం స్ఫూర్తిదాయకం

#Dr. Babu Jagjivanram

జెగ్జీవన్ రావు జీవితం అందరికీ స్ఫూర్తి దాయకం అని ములుగు జిల్లా zp వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి అన్నారు. 116వ జయంతిని జెడ్పీ కార్యాలయంలో ఆమె నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ కులరహిత సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప నేత డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ అని అన్నారు. దేశ స్వాతంత్య్రం, సామాజిక సమానత్వం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఆదర్శనేత అని కొనియాడారు.

జగ్జీవన్‌ రామ్‌ వంటి మహానీయుల ఆశయ సాధనలో భాగంగా సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. సామాజిక, ఆర్థికరంగాల్లో దళితుల ఆత్మగౌరవాన్ని అత్యున్నతంగా నిలిపేందుకు జగ్జీవన్ రామ్ బాటలో చిత్తశుద్ధితో సీఎం కేసీఆర్ గారు కృషి చేస్తున్నారని వెల్లడించారు. తరతరాలుగా సామాజిక, ఆర్థిక వివక్షకు గురవుతున్న దళిత సమాజ సమగ్ర అభివృద్ధికి పాటుపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే నని అన్నారు. బాబూ జగజీవన్ రాం వంటి మహనీయుల ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలనీ సూచించారు.


ఆమె వెంట మలుగు మండల బీ ఆర్ ఎస్ అధ్యక్షులు బాదం.ప్రవీణ్,జాకారం గ్రామ సర్పంచ్ దాసరి.రమేష్, యువజన విభాగం నాయకులు బైకని సాగర్,మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు రాజా హుస్సేన్, జిల్లా బీసీ సెల్ నాయకులు రాసమళ్ళ సురేందర్,నియోజక వర్గ యూజన విభాగం సమన్వయ కర్త మహేష్ తదితరులు వున్నారు.

Related posts

ప్రశ్నించేవారిని పోలీసులతో వేధిస్తున్న ప్రభుత్వం

Satyam NEWS

గుంటూరులో కనకదుర్గమ్మ దేవాలయం కూల్చివేత

Satyam NEWS

మట్టపల్లి శ్రీ లక్ష్మీనృసింహ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం నిర్వహణ కమిటీ సమావేశం

Satyam NEWS

Leave a Comment