38.2 C
Hyderabad
April 29, 2024 12: 24 PM
Slider మెదక్

అభివృద్ధి పథంలో దూసుకువెళుతున్న నారాయణ ఖేడ్

#harishrao

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో బి ఆర్ ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ మంజు శ్రీ జయపాల్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఇతర బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. 60 ఏళ్ల నుంచి ఒక కుటుంబం చేతిలో బందీ అయిన నారాయణఖేడ్ నియోజకవర్గానికి స్వతంత్రం కల్పించింది  బి ఆర్ ఎస్ కార్యకర్తలు అని ఈ సందర్భంగా హరీష్ రావు అన్నారు.

భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నారాయణఖేడ్ కి  స్వతంత్రం రాలేదు అభివృద్ధి జరగలేదు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం  బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే  బి ఆర్ ఎస్ కార్యకర్తల వల్లే ఈరోజు నారాయణఖేడ్ అభివృద్ధి చెందుతుంది. అత్యధిక గిరిజన జనాభా ఉన్న నియోజకవర్గంలో ఒక్క గిరిజన రెసిడెన్షియల్ పాఠశాల తేలేకపోయారు 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అని ఆయన ఎద్దేవా చేశారు. ఈరోజు ఎక్కడ భూపాల్ రెడ్డి 4 గిరిజన గురుకుల పాఠశాలలుతెచ్చి ఒక ఒక  గురుకులానికి నాలుగు కోట్ల 20 లక్షలు మంజూరు చేయించుకున్నారు.

ప్రతి ఇంటికి త్రాగునీరు అందించి అక్కాచెల్లెళ్లకు కిలోమీటర్లు నీళ్లు మోసే బాధ లేదు. మన పక్కనే ఉన్న కర్ణాటక మహారాష్ట్ర లో  ఆసరా పెన్షన్ ఉందా పెళ్లయితే కల్యాణ లక్ష్మి ఉందా ఇంటింటికి మంచినీళ్లు ఉన్నాయా రైతుబంధు ఉందా రైతు బీమా ఉందా అని ఆయన ప్రశ్నించారు. బీ ఆర్ ఎస్ అంటే బీదలు రైతులు సామాన్యుల పార్టీ. ఏప్రిల్ 27 తో మన పార్టీ కి 22 యేండ్లు నిండుతాయి. గత అక్టోబర్ లో మారింది పార్టీ పేరు మాత్రమే.

ఈ ఎనిమిదేళ్లలో అభివృధ్ధికి సాక్ష్యాలెన్నో.. ఇదీ తెలంగాణ అని మనం గర్వం గా చెప్పుకునే సంగతులెన్నో మనం కల గన్నామా 24 గంటల కరెంటు ఉంటదనీ, మిషన్ ప్రతి ఇంటికి నదీ నీళ్లు పైపుల ద్వారా వస్తాయనీ.. సమైక్య పాలనలో కలలో కూడా ఉహించనవి ఇప్పుడెలా సాధ్యమవుతున్నాయి. అల్లాఉద్దీన్ అద్భుత దీపం తో అయిందా. ఏదైనా మ్యాజిక్ తోనే మంత్రం తోనే ఇవన్నీ సాధ్యపడ్డాయా తెలంగాణ కు ఆలాఉద్దీన్ అద్భుత దీపం లేదు కానీ ..నిరంతరం ప్రజల జీవితాల నుంచి చీకట్లను తరిమే కేసీఆర్ అనే దీపం ఉంది. ఉద్యమ జ్వాల కేసీఆర్ యే, అభివృద్ధి   జ్వాల కూడా కేసీఆర్ అని మంత్రి హరీష్ రావు అన్నారు.

Related posts

తాత్కాలిక నియామకాలు వద్దు పర్మినెంట్ కావాలి

Satyam NEWS

సాక్షి ఉద్యోగికి సలహాదారుడి పదవి

Satyam NEWS

హన్మకొండలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం

Satyam NEWS

Leave a Comment