38.2 C
Hyderabad
May 2, 2024 19: 41 PM
Slider ప్రపంచం

# NotMyKing: బ్రిటన్ లో రాజుకు వ్యతిరేకంగా ప్రదర్శనలు

#NotMyKing

బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II మరణం తర్వాత కింగ్ చార్లెస్ III సింహాసనాన్ని అధిష్టించడాన్ని అక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా ఎంత కాలం ఈ రాచరికపు వ్యవస్థ అంటూ ప్రశ్నిస్తున్నారు. ‘నాట్‌మైకింగ్‌’ అనే హ్యాష్ ట్యాగ్ తో బ్రిటన్ ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కింగ్ చార్లెస్ III పట్టాభిషేకం గురించి ఆందోళనలు రోజు రోజుకూ ఊపందుకుంటున్నాయి.

రాచరిక వ్యతిరేక నిరసనకారుల బృందం పట్టాభిషేకం ఘట్టాన్ని భంగపరిచేందుకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తోంది. వీరిని అదుపు చేసేందుకు తొలుత పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించారు. అయితే బ్రిటిష్ పోలీసులు కఠినంగా వ్యవహరించినందుకు సామాజిక కార్యకర్తలు మరియు పౌర హక్కుల సంఘాల వారు నిప్పులు చెరిగారు.

ఎడిన్‌బర్గ్‌లోని ఓ మహిళ ‘సామ్రాజ్యవాదం, రాచరికాన్ని అంతం చేయండి’ అనే పోస్టర్‌ను ప్రదర్శించింది. లండన్‌లో ‘నాట్‌మైకింగ్‌’ అని ప్లకార్డు పట్టుకున్నందుకు మరో మహిళను పార్లమెంట్‌ గేటు ముందు నుంచి బలవంతంగా తొలగించారు.

ఆక్స్‌ఫర్డ్‌లో, కొత్త రాజుగా చార్లెస్‌ను ప్రకటించడాన్ని ప్రస్తావిస్తూ ‘అతన్ని ఎవరు ఎన్నుకున్నారు?’ అని నినాదాలు చేసినందుకు సైమన్ హిల్ అనే వ్యక్తి చేతికి సంకెళ్లు వేసి పోలీసు వ్యాన్‌లోకి ఎక్కించారు. ఒక న్యాయవాది సోమవారం పార్లమెంటు వెలుపల తనను పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు.

తాను ఖాళీ కాగితాన్ని మాత్రమే తీసుకువెళుతున్నానని, దానిపై ‘నాట్ మై కింగ్’ అని రాయాలని అనుకున్నాని చెప్పారు. దాంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆయనను అక్కడ నుంచి తొలగించారు. ఇప్పుడు NotMyKing అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది. రాచరికం రద్దు కోసం ఉద్యమిస్తున్న ఈ సంస్థ రానున్న నెలల్లో రాచరికానికి వ్యతిరేకంగా మరిన్ని ప్రదర్శనలు నిర్వహిస్తామని చెప్పారు.

Related posts

కామారెడ్డి బరిలో 74 మంది అభ్యర్థులు

Satyam NEWS

పాడి పశువులలో ఈతల మద్య కాలాన్ని తగ్గించాలి

Satyam NEWS

కేసీఆర్ పుణ్యమా అని రోజుకూలిగా మారిన ఆర్టీసీ కార్మికుడు

Satyam NEWS

Leave a Comment