33.7 C
Hyderabad
April 27, 2024 23: 54 PM
Slider నిజామాబాద్

కామారెడ్డి బరిలో 74 మంది అభ్యర్థులు

#kamareddy

తెలంగాణ ఎన్నికలు మొత్తం కామారెడ్డి కేంద్ర బిందువుగా సాగుతున్నాయి. ఇక్కడినుంచి సీఎం కేసీఆర్ పోటీలో ఉండటమే కారణం. అయితే గతంలో సీఎం కేసీఆర్ పై వేలాదిగా నామినేషన్లు వేస్తామని ప్రకటించిన వాళ్ళు కనుమారుగయ్యారు. నేడు నామినేషన్లకు చివరి రోజు కావడంతో నామినేషన్స్ పూర్తి వివరాలు అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 195 నామినేషన్లు దాఖలయ్యాయి. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో 74 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 103 నామినేషన్లు దాఖలు చేశారు. ఎల్లారెడ్డిలో 30 మంది అభ్యర్థులు 42 నామినేషన్లు దాఖలు చేయగా జుక్కల్ నియోజకవర్గంలో 40 మంది అభ్యర్థులు 50 నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఈసారి అన్ని నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్ధులు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. న

నామినేషన్స్ విత్ డ్రా సమయానికి ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉంటారో తెలియనుంది. కామారెడ్డిలో ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి సీఎం కేసీఆర్, బీజేపీ నుంచి మాజీ జడ్పీ చైర్మన్ కాటిపల్లి వెంకట రమణారెడ్డి, కాంగ్రెస్ నుంచి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మద్యే ప్రధానంగా పోటీ జరగనుంది.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

నిరుపేద అమ్మాయి పెళ్లికి అండగా ఉప్పల

Satyam NEWS

బండ్లగూడ,పోచారం స్వగృహ ఫ్లాట్లు యధాస్థితిలో అమ్మకానికి సిద్ధం

Satyam NEWS

రాహుల్ గాంధీకి అందరూ సంఘీభావం తెలపాలి

Satyam NEWS

Leave a Comment