39.2 C
Hyderabad
May 3, 2024 11: 04 AM
Slider ప్రత్యేకం

శిల్పారామంలో ఆలరించిన మయూరాల నృత్య నీరాజనం

#shilparamam

మేడ్చల్ జిల్లా ఉప్పల్ శిల్పారామంలోని ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ హంపి థియేటర్ లో శ్రీ మయూరి కూచిపూడి నృత్య నృత్యాలయ నాట్యరత్న గురు రాజనాల శ్రీదేవి శిష్య బృందం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం జరిగిన కూచిపూడి శాస్త్రీయ నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నటరాజుకు ‘నృత్య నీరాజనంగా’ ప్రదర్శించిన ప్రతి అంశాన్ని ఎంతో అద్భుతంగా ప్రదర్శించారు. ఇందులో భాగంగా ప్రదర్శించిన విఘ్నరాజం భజే, హర హర శంకర భోశంభో, బ్రహ్మాంజలి, అంబా శంభవి, జయ మహేశ్వర, నారాయణీయం, దశావతార శబ్దం, కట్టెదుర వైకుంఠం, శ్రీమన్నారాయణ, ముద్దుగారే యశోద, మరకత మణి మయచేల, తిల్లాన అంశాలు ఆసాంతం ప్రేక్షకులను అలరించాయి.

మరకత మని మామ చేలా అంటూ రాజనాల నందితా లక్ష్మి తన అభినయంతో చూపరులను కట్టిపడేసింది. ప్లేట్ మీద సాగిన ఈ అంశం ఆసాంతం అలరించింది. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, శ్రీమాతా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రవీణ్ స్వామీజీ, వాసవి విజ్ఞాన్ సేవా క్లబ్ అధ్యక్షులు, శ్రీమాతా చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి తడకమళ్ళ కరుణాకర్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నేటి తరం విద్యార్థులకు ఇలాంటి కలలు ఎంతో అవసరమని, నాట్యకళ ప్రతిభ తో ఆకట్టుకున్న కళాకారులను ముఖ్య అతిధులు ప్రశంసించారు. విద్యార్థులకు ఇలాంటి కలలు ఎంతో అవసరమని అన్నారు. అనేక మంది చిన్నారులకు ఈ నాట్య విద్యలో శిక్షణ ఇస్తున్న నాట్యరత్న శ్రీ గురు రాజనాల శ్రీదేవిని వారు అభినందించారు. గురు పరంపరగా ఈ నాట్యవిద్యను భావితరాలకు అందించడమే ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా నాట్యరత్న గురు రాజనాల శ్రీదేవి అన్నారు.

Related posts

పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన స్పీకర్

Satyam NEWS

బోణాల జాతర

Satyam NEWS

అంతర్వేది రధం తగలబెట్టిన వారిని కఠినంగా శిక్షిస్తాం

Satyam NEWS

Leave a Comment