40.2 C
Hyderabad
April 29, 2024 16: 18 PM
Slider కవి ప్రపంచం

బోణాల జాతర

#Pratikantham Sarithashree

భాగ్య నగరమా నీకెంత భాగ్యమో కదా

విశ్వ నగరమా నీదెంత విశాల హృదయమో సుమా

తరతరాల బోణాలు స్మారక తోరణాలు ఏర్పాటు చేసిన కారుణ్యమయివి

అలుపెరుగని అనన్య కార్యసాధకురాలివి పది కాలాలు పరవశించేటట్టు తెలంగాణ ప్రజల మది నిండ

బోణాల గుబాళింపును కలుగ చేసిన కరుణా మూర్తి

పోతరాజుల విన్యాసాలతో విరజిమ్మే సంబరాలు సకల కలా శోభితం

అందరి ప్రజలకు దిక్సూచి ఆషాడ మాసం లో భూమంత పచ్చటి యాప కోమ్మ లతో నిండిన ఆకాశం

చీరె సింగారించుకొని సొమ్మలు అలంకరించుకొని

బోణం నెత్తిన బెట్టుకొని ముత్తెదువలు అంతా ఎల్లమ్మ మల్లమ్మ దేవతలైనారు

నెత్తిన దీపాలు నక్షత్రాల వెలుగులు సిమ్ముతున్నాయి

ఇల్లు అంతా సందడిగా గల్లీలన్ని పలుకరింపు ప్రవాహలు ప్రేమ వాసనలు వేద జల్లుతున్నాయి

డోళ్ళు డప్పులు యాప కొమ్మలు బోణం కుండలు

పట్నం అంతా బోణం ఎత్తిన ముత్తయిదువ అయి పోయింది.

రాత్రి పగలుగా దీపాలు వెలిగాయి తొవ్వ పొడుగు

ఊదుడు బుగ్గులు పేలాల ముద్దలు నన్ను పసి దానిని చేసింది. కొత్త బట్టలు

బెల్లం బువ్వ కల్లు సాక

ఆపాఢం బోణాలు హైదరాబాదు బోణాలు గోల్కొండ

తల్లికి తొలి బోణాలు

ఎల్లమ్మ బోణాలు బెల్లం బువ్వ సాకలు పోచమ్మ బోణాలు కల్లు సాక నైవేద్యాలు

పెద్దమ్మ బోణాలు పప్పు అన్నం నైవేద్యాలు పోలేరమ్మ బోణాలు పోతరాజు ఆటలు

గంగమ్మ బోణాలు గండ దీపం ధూపాలు డప్పుల దరువుల్లో తీన్‌మార్ ఆటలు

తెలంగాణ తల్లికి బంగారు బోణం

ప్రతికంఠం సరితశ్రీ, రంగారెడ్డి జిల్లా, 9100439 88 4

Related posts

ఉపాధి బిల్లులు చెల్లించని జగన్ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ కేసు

Satyam NEWS

153 ప్రాంతాల్లో 60 అతి స‌మ‌స్యాత్మ‌క ప్ర‌దేశాలు

Satyam NEWS

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే ఉక్కుపాదం

Satyam NEWS

Leave a Comment