31.2 C
Hyderabad
May 3, 2024 01: 20 AM
Slider నెల్లూరు

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ NSS వాలంటీర్ల శ్రమదానం

#SimhapuriUniversity

నెల్లూరు జిల్లా కాకుటూరు లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ మట్టి రోడ్డును NSS వాలంటీర్లు మరమ్మత్తు చేశారు. నివర్ తుఫాన్ వలన నార్త్ గేట్ వద్ద రోడ్డు  పాడయిపోయింది.

ఇందువల్ల వహనాదారుల రాకపోకలకు కొంత అసౌకర్యం కలిగింది. ఈ రోడ్డు మరమ్మతులను అలాగే గుంటలను హెల్ప్ దీ నీడీ టీం, NSS వాలంటీర్లు శ్రమదానం చేసి రోడ్డు మరమ్మత్తులను సరిచేశారు.

ఈ సందర్భంగా శ్రమదానం చేసిన వాలంటీర్లను విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రొక్కం సుదర్శన రావు ప్రత్యేకంగా అభినందించారు.

ఇంత చిన్న వయస్సులో వారు చేసిన శ్రమదానం, బాధ్యతగా నిర్వర్తించిన తీరును అందరూ ప్రేరణగా తీసుకొని సమాజం పట్ల అందరూ బాధ్యతగా ఉండాలని కోరారు.

అదేవిధంగా మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్ యం రహామతుల్లాహ్ NSS వాలంటీర్లను అభినందించారు.

యువత చదువును, స్వచంద కార్యక్రమాలలో పాల్గొంటూ విశ్వవిద్యాలయ కీర్తి ప్రతిష్టలు పెంచే దిశగా ఉన్నారంటూ ఇటీవల బెస్ట్ స్టేట్ NSS అవార్డును తెచ్చుకున్న పార్థసారథిని మెచ్చుకున్నారు.

ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని తెలిపారు. అదేవిధంగా విశ్వవిద్యాలయ NSS విభాగాన్ని సందర్శించారు.

గొప్ప గొప్ప కార్యక్రమాలను చేస్తూ విశ్వవిద్యాలయ అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న విశ్వవిద్యాలయ ఉపకులపతికి ధన్యవాదాలను తెలుపుతూ అదేవిధంగా NSS సమన్వయకర్తను అభినందన తెలిపారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రెక్టార్ ఆచార్య యం. చంద్రయ్య, విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా.ఎల్ వి విజయ కృష్ణారెడ్డి,

విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్  సుజా యస్ నాయర్, పరీక్షల నియంత్రణాధికారి డా.సాయి ప్రసాద్ రెడ్డి వాలంటీర్లను అభినందించారు.

Related posts

ములుగు జిల్లా కేంద్రంలో పెట్రోల్ బంకులను తెరవాలి

Bhavani

పేదవారికి 5 లక్షల కోడిగుడ్లు ఇవ్వనున్న శ్రీనివాస హేచరీస్

Satyam NEWS

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాష్టీకంపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు

Satyam NEWS

Leave a Comment