తెలంగాణ రాష్ట్రం ఇన్నోవేషన్ డెస్టినేషన్‌గా మారిందని టెక్ మహీంద్రా సిఇఒ గుర్నాని వ్యాఖ్యానించాడు. వరంగల్‌లోని మడికొండ ఐటి పార్క్‌లో టెక్ మహీంద్రా, సైయెంట్ క్యాంపస్‌లను మంత్రి కేటీఆర్ తో కలిసి గుర్నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
మంత్రి కేటీఆర్ పెద్ద కలలు కంటున్నారని, వాటిని సాకారం చేస్తున్నారని కొనియాడారు. వరంగల్ మరో పూణేగా మారుతోందన్నారు. వరంగల్‌లో ఈ ఏడాదిలోనే ఆరు అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లు నిర్వహించామన్నారు. వరంగల్ టెక్ మహీంద్రా క్యాంపస్‌ను అతి పెద్దదిగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈటెల రాజేందర్, సత్యవతిరాథోడ్, ఎంపిలు, ఎంఎల్‌ఎలు పాల్గొన్నారు.
అత్యాధునిక హంగులతో ఐదు ఎకరాల్లో సైయెంట్ నూతన భవనం నిర్మాణం జరిగింది. ప్రస్తుతం 600 నుంచి 700 మంది ఉద్యోగులకు సేవలు అందించేందుకు వీలుగా భవన నిర్మాణం చేపట్టామని, టెక్ మహీంద్రాలో 100 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తించనున్నారు. 2016 ఫిబ్రవరిలో వరంగల్ ఐటి సెజ్‌లో ఇంక్యుబెషన్ కేంద్రం ప్రారంభించారు.