39.2 C
Hyderabad
May 4, 2024 21: 13 PM
Slider ప్రత్యేకం

Austin-Texas లో ఎన్టీఆర్ శతజయంతి వేడుక

#komatijayaram

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలను ఆదివారం Austin-Texas లో Austin NRI TDP విభాగం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు 450 మందికి పైగా ఎన్టీఆర్ అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, శాస్త్రీయ నృత్యాలు, స్వరాంజలి టీం పాడిన పాటలు, NTR జీవిత విశేషాలతో కూడిన బింగో, క్విజ్ ట్రివియా ఆటలు అభిమానులను ఎంతగానో అలరించాయి.

తన స్వాగత ప్రసంగంలో Austin NRI TDP అధ్యక్షులు లెనిన్ ఎర్రం మాట్లాడుతూ సినీరంగం లో, రాజకీయరంగం లో NTR సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా US NRI TDP విభాగం కన్వీనర్ కోమటి జయరాం పాల్గొని సభనుద్దేశించి ప్రసంగించారు. అన్ననందమూరి తారక రామారావు ని స్మరించుకుంటూ, అయన ఆశయాలను, తీసుకున్న వినూత్న నిర్ణయాలను రాబోయే తరానికి తెలియజేసారు. ఈ కార్యక్రమాన్ని Austin NRI TDP టీం లోని ప్రతి సభ్యుడు స్వచ్ఛందంగా పాల్గొని తమ వంతు కృషి చేసి విజయవంతంగా ముగించారు.

Related posts

నడి రోడ్ పై త్రిబుల్ రైడింగ్.. అదీ ట్రాఫిక్ పోలీసులు ఉండగానే…!

Satyam NEWS

పవన్ లోకేష్ పై రోజా సెన్సేషనల్ కామెంట్స్

Satyam NEWS

దుబ్బాక లో ఏప్రిల్ 10న లోక్ అదాలత్

Satyam NEWS

Leave a Comment