30.7 C
Hyderabad
April 29, 2024 06: 47 AM
Slider మెదక్

దుబ్బాక లో ఏప్రిల్ 10న లోక్ అదాలత్

#Lok Adalat

సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ఏప్రిల్ 10వ తేదీన మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు దుబ్బాక ఇంచార్జి జూనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్ తెలిపారు.

చిన్న చిన్న తగాదాలు భూ సంబంధ తగాదాలు కుటుంబ తగాదాలు భార్యాభర్తల మధ్య తగాదా లతో పోలీసు కేసులు నమోదయిన ఇరువర్గాలకు రాజీ ప్రయత్నంలో భాగంగా ఈ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జడ్జి కిరణ్ కుమార్ తెలిపారు.

ఇరు వర్గాల మధ్య రాజీ కుదరడంతో భవిష్యత్తులో ఎలాంటి కక్షలు, కార్పణ్యాలు కు అవకాశం ఉండదన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన సూచించారు.

అదేవిధంగా దుబ్బాక కోర్టు పరిధిలోని కక్షిదారులు తమ తమ కేసులను రాజీ కుదుర్చుకునేందుకు సిద్దిపేటలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంటుందన్నారు. దుబ్బాక కోర్టుకు పూర్తిస్థాయి న్యాయమూర్తి లేనందున దుబ్బాక పరిధిలోని కేసులు అన్నింటికీ సిద్దిపేటలోని రాజీ కుదిర్చేందుకు అవకాశం ఉండదన్నారు.

Related posts

రామప్ప దేవాలయాన్ని సందర్శించిన ఆర్థిక శాఖ కార్యదర్శి

Bhavani

ఎమ్మార్పీఎస్ నేత కందుల రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఆళ్ళ నాని

Satyam NEWS

హుజూరాబాద్ లో పెట్రో ధరలపై వెల్లువెత్తిన నిరసన

Satyam NEWS

Leave a Comment