38.2 C
Hyderabad
May 5, 2024 22: 09 PM
Slider విజయనగరం

ఉత్తరాన ఎన్టీఆర్ విగ్రహం… దక్షిణాన సావిత్రి భాయి విగ్రహం…!

#NTR statue

విద్యలనగరమైన విజయనగరం జిల్లా కేంద్రంలో ఓ ఘట్టం ఆవిషృతమైంది. అప్పుడెప్పుడో టీడీపీ ప్రభుత్వం హాయాంలో కలెక్టరేట్ వద్ద..గంట్యాడ వెళ్లే దారిలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టి కలెక్టరేట్ జంక్షన్ గా తీర్చిదిద్దితే…తాజాగా బీసీ సంఘాలను భుజానకెత్తుకున్న జగన్ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి, విద్యాశాఖ మంత్రి బొత్స..

అలాగే జేడ్పీ చైర్మన్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు లతో పాటు బీసీ నేత ముద్దాడ మధు ఆధ్వర్యంలో అదే కలెక్టరేట్ జంక్షన్..వద్ద దక్షిణాన పోలీసు కంట్రోల్ రూమ్ వద్దే 190 ఏళ్ల క్రితం సమాజంలో కుల దురహంకారాన్ని రూపు మాపి..భార్య తో సహా పోరాటం చేసిన జ్యోతిరావు పూలే..ఆయన భార్య సావిత్రి భాయి పూలేల విగ్రహహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దీనికి తోడు ఫ్లడ్ లైట్ల వెలుగులో..

ఆ జంక్షన్ ను పూలే జంక్షన్ గా పేరు పెట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల… సావిత్రి భాయి పూలే గురించి మాట్లాడారు. అలాగే మంత్రి బొత్స భార్యాభర్తలు ఇద్దరూ బీసీ లకు కోసం.. అలాగే మెరుగైన సమాజం కోసం… చేసిన కృషి ని వెల్లడించారు. మొత్తానికి విజయనగరం లో మరో జంక్షన్ లో మరో నేత ఆయన భార్యల విగ్రహం తో పాటు వాళ్లపేరుతోనే ప్రజలలోకి రావడం ముదావహమని “సత్యం న్యూస్. నెట్” అంటోంది.

Related posts

వరి వేయండని చెప్పిన వారు ఇప్పుడు పారిపోయారు

Satyam NEWS

సీఎం జగన్ కి విద్యా వ్యవస్థపై సరైన అవగాహన లేదు

Satyam NEWS

స్మార్ట్ పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞానంలో దేశంలోనే తెలంగాణ పోలీస్ ఆదర్శం

Satyam NEWS

Leave a Comment