39.2 C
Hyderabad
May 3, 2024 12: 58 PM
Slider ప్రత్యేకం

వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ సాయం

#ntrtrust

స్వయంగా చెక్కులను బాధితులకు అందజేసిన నారా భువనేశ్వరి

సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అనే సిద్ధాంతంతో ఎన్టీఆర్ ట్రస్ట్ తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఎవరికి ఏ కష్టమొచ్చినా క్షణాల్లో స్పందించి ఆపన్న హస్తం అందిస్తోంది.  ఇటీవల చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో సంభవించిన వరద బీభత్సానికి సర్వం కోల్పోయిన బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా నిలిచింది.  వరదల్లో ప్రాణాలు కోల్పోయిన 48 కుటుంబాలకు  ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ , టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆర్థికసాయం చేశారు. ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చొప్పున చెక్కులను స్వయంగా అందజేశారు.  తిరుపతి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ భావజాలం వేరైనా కష్టకాలంలో బాధితులకు మనమంతా ఒక్కటై సాయం చేయాలని అన్నారు. వరద బీభత్సానికి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, భారీ ఆస్తి నష్టం జరిగిందని భువనేశ్వరి తెలిపారు. ఈ సమయంలో చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు అండగా నిలబడ్డారని ఆమె గుర్తు చేశారు. వరదల వల్ల సర్వం కోల్పోయిన వారిని చూసి తన మనసు కలిచివేసిందని ఆమె అన్నారు. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని, అసూయ, ద్వేషాల స్థానంలో ప్రేమను పెంచాలని భువనేశ్వరి అన్నారు. సమాజానికి సేవ చేయాలని ఎన్టీఆర్ ఎప్పుడూ తపించేవారని, నిరుపేదలను ఆదుకోవడానికే తన జీవితాన్ని ఎన్టీఆర్ అంకితం చేశారని భువనేశ్వరి అన్నారు.

Related posts

పర్యావరణ ప్రభావంపై శిక్షణ కార్యక్రమం

Satyam NEWS

అన్నదానం మహాదానం

Bhavani

10 శాతం రిజ‌ర్వేష‌న్లపై హ‌ర్షాతిరేకాల వెల్లువ

Sub Editor

Leave a Comment