భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ అసెంబ్లీ ఆమోదించి 70 సంవత్సరాలు అయిన సందర్భంగా రాజ్యాంగ ప్రవేశికల తొలిపలుకులను (Preamble Constitution of India) సచివాలయ సిబ్బందిచే జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా చదివించారు. మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో Constitution Day ను పాటించారు. జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తో పాటు, Law Secretary సంతోష్ రెడ్డి సిబ్బందిచేత Constitution Preamble ను చదివించారు. కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు Constitution Day ను పురస్కరించుకొని రాజ్యాంగంలోని ముఖ్యాంశమైన ప్రాధమిక విధులపై నవంబర్ 26 నుండి 14-4-2020 వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశామని జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా తెలిపారు. భారత రాజ్యాంగం గొప్పతనాన్ని, విశిష్టతను ప్రజలకు చాటి చెప్పేలా కార్యక్రమాలుండాలని అన్నారు. రాజ్యాంగ రచనలో పాలుపంచుకున్న మహనీయులు బాబా సాహెబ్ అంబేడ్కర్, ఇతర ముఖ్యులకు ప్రతి సంవత్సరం నివాళులర్పిస్తున్నారు. 70 వసంతాలను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో జిఏడి డిప్యూటి సెక్రటరీ చిట్టిరాణి, దేవేందర్ రావు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
previous post
next post