ఫిబ్రవరి 14 అనగానే అందరికీ గుర్తొచ్చేది వాలంటైన్స్ డే! దీని ముసుగులో యువత తనను తాను మరచి వ్యవహరిస్తోంది. ప్రేమికుల రోజు అంటూ బరి తెగిస్తోంది. క్లబ్బులు, పబ్బులు, రెస్టారెంట్లు, మాల్స్, మల్టీ నేషన్ కంపెనీలు డబ్బులు దండుకునేందుకు విచ్చలవిడి తనాన్ని పెంచి పోషిస్తున్నాయి.
ఆన్ ఆన్ లైన్ లో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ విధమైన పాశ్చాత్య సంస్కృతిని తిప్పికొడతామని వాలెంటెన్స్ డే ను అడ్డుకుంటామని బజరంగ్ దళ్ హెచ్చరిస్తోంది. 2019 ఫిబ్రవరి 14న వీరమరణం పొందిన సైనికులకు వందనం సమర్పించాలని విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ పిలుపునిస్తోంది.
సరిగ్గా ఏడాది క్రితం దేశ రక్షణ కోసం విధులు నిర్వహించేందుకు బయల్దేరిన జవాన్లపై పుల్వామా దగ్గర పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాది మానవ బాంబుగా వచ్చి దాదాపు 45 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న సంఘటన ప్రతి భారతీయుడి గుండె మండేలా చేసింది. దేశ ప్రజల సౌభాగ్యం కోసం భరత భూమిని కంటికి రెప్పలా కాపాడేoదుకు బయల్దేరిన సైనికులను దొంగ దెబ్బ తీయడం టెర్రరిస్టుల పిరికిపంద చర్య అని బజరంగ్దళ్ విమర్శిస్తోంది.
దేశ హితం కోసం పనిచేస్తున్న బజరంగ్ దళ్ సైనికుల త్యాగాలను స్మరించుకుంటోoది. భరతమాత సేవలో అమరులైన వీరులకు ఫిబ్రవరి 14న అన్ని పార్కులు.. ప్రధాన కూడళ్లు.. చౌరస్తాలు.. జనసమ్మర్ధం గల ప్రాంతాల్లో నివాళులు అర్పించాలని యువత, విద్యార్థులను కోరుతోంది.
“దేశం కోసం.. ప్రజల కోసం ప్రాణాలర్పించిన సైనికులకు వందనం చేయడం ప్రతి భారతీయుడి విధి” అని గుర్తు చేస్తోంది. సైనికుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం కావాలని, ప్రతి ఒక్కరిలో దేశభక్తి రగిలించే భావన నింపాలని బజరంగ్ దళ్ ఆశిస్తోంది.