42.2 C
Hyderabad
April 26, 2024 18: 18 PM
Slider తెలంగాణ

ప్లీజ్ కన్సిడర్: అధికారుల నిర్లక్షంతో పీఆర్సీ కోల్పోతున్నాం

brk bhavan

పీఆర్సీ గడువు పెంపు పై ఉద్యోగులలో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను కలిసినట్లు తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మచారి, తెలంగాణ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ పవన్ కుమార్ గౌడ్ తెలిపారు.

పీఆర్సీ జిఓ లో స్పష్టత లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందారని వారన్నారు. పీఆర్సీ కాకుండా ఉద్యోగుల సర్వీస్ రూల్స్, బిజినెస్ రూల్స్, జిల్లాల పునర్వివ్యవస్తికరణ, కొత్త జిల్లాలకు క్యాడర్ స్ట్రేంత్, జోనల్  పునర్వ్యవస్థీకరణ సంబంధించిన వివరాలపై స్పష్టత ఇవ్వకపోవడం పై వారు ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇన్ టైం లో పీఆర్సీ ఇవ్వాలని చెప్పారని, ఇప్పటికే పీఆర్సీ పై 3 మెన్ కమిటీ వేశారని అయితే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి పీఆర్సీ ని ఆలస్యం చేస్తున్నారని వారన్నారు. ఇప్పటికే రెండు పీఆర్సీ లు కోల్పోయామని, తెలంగాణ ఉద్యమం లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమం కు మొదటి ప్రియార్టీ ఇచ్చారు సీఎం కేసీఆర్.

మేము తెలంగాణ కోసం కష్టపడి పని చేస్తున్నాం మా ఉద్యోగ సంఘాలకు కూడా పీఆర్సీ ఇస్తారు అని ఆశిస్తున్నాము. కొత్త జిల్లాలో స్టాఫ్ లేకున్నా పని ఎక్కువ అయిన చేశాం. అన్ని సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా సాగుతున్నాయి అని వారన్నారు. రాష్ట్రంలో ఇవ్వాల్సింది ఉద్యోగుల పీఆర్సీ తోపాటు ఉద్యోగుల వయోపరిమితి, ఎపి లో ఉన్న 4వ తరగతి ఉద్యోగుల సమస్యపై త్వరలో సీఎం కేసీఆర్ నెరవేస్తారని నమ్మకం ఉంది అని వారు తెలిపారు.

Related posts

అనుమానాస్పద పరిస్థితుల్లో వివాహిత మృతి

Satyam NEWS

పేకాట‌రాయుళ్ల‌పై దాడులు భారీగా ప‌ట్టుబడ్డ న‌‌‌గ‌దు

Sub Editor

పాదయాత్రలో ఇచ్చిన హామీ గుర్తు లేదా ముఖ్యమంత్రి గారూ?

Satyam NEWS

Leave a Comment