Slider తెలంగాణ

త్వరలో ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేస్తాం

rajendar45

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా వైద్య ఆరోగ్యశాఖలో పోస్టులన్నింటిని త్వరలో భర్తీ చేస్తామని మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. శాసనసభలో మెడికల్​ సీట్ల భర్తీ, సిబ్బంది కొరతపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యఆరోగ్యశాఖలో పోస్టులన్నింటిని త్వరలో భర్తీ చేస్తామని మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. శాసన సభలో మెడికల్​ సీట్ల భర్తీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. రాష్ట్రంలో 11 ప్రభుత్వ కాలేజ్​లు, 23 ప్రైవేట్​ కాలేజ్​లు ఉన్నాయని వెల్లడించారు. వీటిలో మొత్తం 4790సీట్లు ఉండగా ప్రభుత్వ సీట్లు1640, ఈఎస్ఐ 100, ఎయిమ్స్​లో 50 ​ సీట్లు ఉన్నట్లు తెలిపారు. ఎన్నారైలకు కేవలం 15 సీట్లు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. నీట్​ పరీక్ష అమలులోకి వచ్చాక మెరిట్​ లేకుండా మెడికల్​ సీట్లను భర్తీ చేయటం లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుకూలంగా కాలేజ్​లను పెంచామని… నాణ్యమైన విద్య అందించేందుకు ప్రొఫెసర్లను పెంచుకుంటూ పోతున్నట్లు స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా జనాభా ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు

Related posts

మాజీ మంత్రి నాయినిని పరామర్శించిన మంత్రి ఈటెల

Satyam NEWS

జనతా కర్ఫ్యూ పాటించాలని హైదరాబాద్ పోలీసు పిలుపు

Satyam NEWS

ఏపిలో చెత్త రోడ్లను వీడియోతో సహా చూపించిన సిపిఐ నారాయణ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!