28.7 C
Hyderabad
May 6, 2024 02: 15 AM
Slider నిజామాబాద్

వాటర్ ఫాల్ ను తలదన్నే భగీరథ లీకేజీ

#missionbhagiratha

ఈ ఫోటో చూస్తే ఆహా ఇలాంటి దృశ్యం ఎక్కడా కనిపించదని ఫోటో తీసుకోవాలని కుతూహలంగా అనిపిస్తుంది కదా.. రోడ్డు వెంట వెళ్లే వారిని ఆకర్షిస్తూ కనువిందు చేసే వాటర్ ఫాల్ ను తలపిస్తుంది కదూ.. కానీ ఇది వాటర్ ఫాల్ కాదండి.. మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం ఈ ఫోటో. కామారెడ్డి మండలం గర్గుల్ నుంచి రామారెడ్డి వెళ్లే దారిలో ప్రధాన రహదారి పక్కనే మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ అయింది. ఆ నీరు వాటర్ ఫాల్ ను తలపించే విధంగా చిమ్ముతూ పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్తున్నాయి నీళ్లు.

దాంతో అవసరానికి మించి పొలంలో నీరు చేరి పొలం చెడిపోయే ప్రమాదం ఏర్పడింది. ఉదయం నుంచి అటువైపుగా వెళ్తున్న వాహనదారులను ఈ సుందర దృశ్యం ఆకట్టుకుంటుంది. ప్రధాన దారి వెంట అధికారులు వెళ్తూ ఉంటారు. కానీ అధికారులకు ఈ పైప్ లైన్ లీకేజీ కనిపించడం లేదు. మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు పుష్కలంగా తాగునీరు అందిస్తున్నామని, మహిళలు ఎవరు కూడా బిందె పట్టుకుని రోడ్డుపైకి రావడం లేదని ప్రభుత్వం ఓ వైపు గొప్పలు చెప్పుకుంటున్నా అధికారుల నిర్లక్ష్యం మాత్రం ప్రభుత్వాన్ని ఇదేనా నీటి సరఫరా అని వేలెత్తి చూపేలా ఉంటోంది.

ప్రధాన రోడ్డు వెంట లీకేజీ అయిన పైప్ లైనే అధికారులకు కనిపించకపోతే గ్రామాల్లో గల్లీల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటే పట్టించుకుంటారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులూ.. ఇకనైనా స్పందించండి. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురాకండి అని పలువురు విమర్శిస్తున్నారు.

Related posts

తొలితరం ఉద్యమకారుడు చిరంజీవిని పరామర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Satyam NEWS

కాళేశ్వరం జలాలతో కరీంనగర్ సస్యశ్యామలం

Bhavani

ఆడబిడ్డల కన్నీళ్లు ఇంకెనాళ్లంటూ టీడీపీ కాగాడాల ప్రదర్శన…!

Satyam NEWS

Leave a Comment