39.2 C
Hyderabad
April 28, 2024 14: 34 PM
Slider ఖమ్మం

ఆకట్టుకున్న టీ ఎన్ జీ ఓ మహిళ ఉద్యోగుల ఆటపాటలు

#women`s day

ఈ నెల 8 న జరిగే అంతార్జాతీయ మహిళదినోత్సవం ను పురస్కరించుకుని ఈ నెల 5 నుంచి 8 వరకు జరిగే క్రీడా,సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు షేక్.అప్జల్ హసన్, ఆర్.వి.ఎస్ సాగర్ ల నేతృత్వంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు శాబాసు జ్యోతి,స్వప్న ల ఆధ్వర్యంలో  టీఎన్జీవోస్ ఫంక్షన్ హల్ లో సాంస్కృతిక  కార్య క్రమాలలో భాగంగా మహిళా ఉద్యోగులకు డాన్స్,సింగింగ్, ఫ్యాన్స్ డ్రెస్,ఫ్యాషన్ షో,అంత్యాక్షరి,మ్యూజికల్ చైర్ ఫన్నీ గేమ్స్ వంటివి నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళ ఉద్యోగులను ఉద్దేశించి అప్జల్ హసన్  మాట్లాడుతూ మహిళలు ఏ రంగంలో తక్కువ కాదు.మాకు మే మే సాటి అన్నట్లుగా…వయో పరిమితో సంబంధం లేకుండా టిఎన్జీవోస్ నిర్వహించిన ఆటపాటలలో పాల్గొని ఎంతో ఉత్సాహాన్ని కనబరుస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఆటలో మహిళలు ఆసక్తి చూపడమే కాకుండా విజేతలుగా నిలిచేందుకు వారు పడే శ్రమ అంతాఇంతా కాదన్నారు. ప్రతి ఉద్యోగి సోదరికి ఇదే పట్టుదల,ఉత్సాహం తో జీవితంలో కూడా ఎన్నో విజయాలను సాధించాలని ఆకాంక్షించారు.   ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఆర్ వీ ఎస్  సాగర్ .రాష్ట్ర అర్గనైజింగ్ సెక్రెటరీ నందగిరి శ్రీను,జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ సుంచు వీరనారాయణ,జిల్లా  ఉపాధ్యక్షులు ఎం డి  మజీద్ ,ట్రెజరర్ భాగం పవన్,టౌన్ అధ్యక్షులు షేక్.నాగుల్ మీరా,కట్ట  నవీన్  తదితరులు పాల్గొన్నారు.

Related posts

మంత్రి ఎర్ర‌బెల్లిని క‌లిసిన బ్రాహ్మ‌ణ సేవా సంఘం నూత‌న కార్య‌వ‌ర్గం

Satyam NEWS

సెక్స్ పిచ్చోడిని అంతం చేసిన కుటుంబ సభ్యులు

Satyam NEWS

ఎప్రీషియేషన్: ఉర్దూ కాలేజీ విద్యార్ధులకు ప్రశంసాపత్రాలు

Satyam NEWS

Leave a Comment