29.7 C
Hyderabad
May 4, 2024 06: 10 AM
Slider ప్రత్యేకం

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తాం

#Dharani portal

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అప్పయిపల్లి గ్రామంలో సోమవారం ఉపాధి హామీ కూలీలతో మర్యాదపూర్వకంగా కలిసి వారి సమస్యలను తెలుసుకొని రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు చిక్కుడు వంశీకృష్ణఅన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని అధికారంలోకి రాగానే రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని కౌలు రైతులకు ఎకరానికి 12,000 సహాయంతో పాటు పోడు రైతులకు పట్టాలు 15000 పెట్టుబడి సహాయం రెండు లక్షల రైతు రుణమాఫీ ఆడబిడ్డలకు 500 కే గ్యాస్ సిలిండర్ ఇందిరమ్మ ఇంటికి ఐదు లక్షల ఆర్థిక సహాయం ఒక్క ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే కనీస పెన్షన్ 5000 చేస్తామని అదేవిధంగా మొదట ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెల 4000 రూపాయల నిరుద్యోగ భృతి అందిస్తామని తెలిపారు.

ప్రత్యేక చట్టంతో టి.ఎస్.పి.ఎస్.సిని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో పునరుద్ధరణ చేస్తామని 18 సంవత్సరాలు పైబడి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ అందజేస్తామని తెలిపారు. ప్రస్తుతం అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని దుయ్యబట్టారు. దళితులను గిరిజనులను మూడు ఎకరాల స్థలం ఇస్తానని ముంచారని మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ప్రతీ పుట్టబోయే బిడ్డపై ఐదు లక్షల అప్పు ఒప్పజపుతున్నాడని భావితారాల భవిష్యత్తును అప్పుల పాలు చేశాడని కెసిఆర్ పై దుమ్మెత్తి పోశాడు.

రాష్ట్రంలో కేసీఆర్ హామీలు నియోజకవర్గంలో ఎమ్మెల్యేల హామీలు నీటిపై రాతల్ల మిగిలిపోయాయని అసహనం వ్యక్తం చేశారు. కెసిఆర్ కు ఆయన కొడుకు ఆయన కొడుకు వారి తరతరాలే బాగుండాలనే తపన తప్ప రాష్ట్రంలోని ప్రజలు ఎటు వెళ్లిన ఆయనకు అవసరం లేదని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని ఓటర్లకు సూచించారు.

Related posts

జై హో స్టాలిన్ : కోవిడ్ ఆస్పత్రులను సందర్శించిన ముఖ్య మంత్రి

Satyam NEWS

కామారెడ్డిలో 540 నామినేషన్ల దాఖలు

Satyam NEWS

స్టేష‌న్ భ‌వనం నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించిన ఎస్పీ దీపిక….!

Satyam NEWS

Leave a Comment