28.7 C
Hyderabad
April 27, 2024 03: 25 AM
Slider నిజామాబాద్

కామారెడ్డిలో 540 నామినేషన్ల దాఖలు

kareddy nominations

కామారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు రోజుల్లో 540 నామినేషన్లు దాఖలు చేశారు. ఒక్కొక్క వార్డు నుంచి ఒక్కో పార్టీ నుంచి నాలుగు నుంచి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు.

చివరి రోజైన నేడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రాజకీయ పార్టీల నుంచి, స్వతంత్ర అభ్యర్ధులు కలిపి ఎంవుత్తం 350 కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. మరో వందకు పైగా అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వేచి చూస్తున్నారు. నామినేషన్లు చివరి రోజు సందర్బంగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నామినేషన్ కార్యాలయం వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు.

నిన్నమొన్న ఒక్కో అభ్యర్థి వెంట సుమారు ఆరుగురు సభ్యులు రాగా నేడు ఇద్దరికి మాత్రమే అనుమతించారు. మొదట మీడియాకు కూడా అనుమతి ఇవ్వని పోలీసులు తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించి  గంట తర్వాత మీడియాను లోపలికి అనుమతించారు. నామినేషన్ల ప్రక్రియని జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి పరిశీలించారు. రాత్రి 8 గంటల వరకు కూడా నామినేషన్ల పర్వం కొనసాగింది.

కామారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికలు ఈసారి రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.  గతంలో ఎన్నడూ లేని విదంగా అభ్యర్థులు పోటీకి సిద్ధమయ్యారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ ఈ నెల 14 న ఉండటంతో ఆ రోజు ఏ వార్డు నుంచి ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉంటున్నారో స్పష్టం కానుంది. 12, 13 వ తేదీలలో ఆయా పార్టీల నాయకులు ఎంపిక చేసిన అభ్యర్థులకు బి ఫారాలు అందించే అవకాశం ఉంది.

బి ఫారం తీసుకున్న అభ్యర్థులు తప్ప ఇతర అభ్యర్థులు తప్పుకోవాల్సి ఉంటుంది. కానీ ఎంతమంది అభ్యర్థులు పోటీ నుంచి తపౌకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే టిఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం 23 మంది అభ్యర్థులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అధికారికంగా ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి 13 వ తేదీన బి ఫారాలు అభ్యర్థులకు అందించనున్నారు. బీజేపీ నుంచి ఒక్కొ వార్డు నుంచి ఒక్కరూ మాత్రమే నామినేషన్ వేసినట్టు తెలుస్తోంది. మొత్తం మీద కామారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా మారనున్నాయి.

గత నాలుగు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీపై జెండా ఎగురవేస్తూ వస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వరుస ఎన్నికల్లో విజయపథంలో దూసుకుపోతున్న అధికార పార్టీ ఈసారి కామారెడ్డి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయాలన్న కృత నిశ్చయంతో అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. మరోవైపు మున్సిపాలిటీలో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని, అవినీతి లేని పాలన కేవలం బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. మొత్తం మీద ఈ సారి మున్సిపాలిటీ ఎన్నికలు మూడు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీగా ఎన్నికలు సాగనున్నాయి.

Related posts

జేసిబిని దొంగిలించిన వ్యక్తి అరెస్ట్

Satyam NEWS

తిరుపతి టీడీపీ టిక్కెట్టుకు భారీ డిమాండ్

Satyam NEWS

ఒకరికి తెలియకుండా మరొకరు.. మొత్తం ఆరుగురు

Satyam NEWS

Leave a Comment