29.7 C
Hyderabad
May 13, 2024 23: 11 PM
Slider వరంగల్

ప్రేమించమని వేధించి… కత్తితో దాడి చేసి…..

#subedaripolice

తనను ప్రేమించాలని వేధిస్తూ ఒక యువతిపై కత్తితో దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ లో ఈ ఘటన జరిగింది. మొండ్రాయి గ్రామానికి చెందిన అజారుద్దీన్ నిన్నటి రోజు ఒక యువతిపై కత్తితో దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే బాధితురాలి బంధువులు, అజారుద్దీన్ ఒకే గ్రామానికి చెందినవారు కావడం వల్ల బాధితురాలితో పరిచయం ఏర్పడింది.

ఫోన్ నెంబర్ తీసుకుని ప్రేమించమని ఆమెను అతడు తరచూ వేధించే వాడు. అయితే అతని ప్రవర్తన నచ్చక బాధితురాలు అతనితో మాట్లాడడం మాని వేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని నిందితుడు ఎలాగేనా తనను ప్రేమించాలని చెప్పేసి వేధిస్తూండేవాడు. నిన్నటి రోజు బాధితురాలు ఇంటిలో ఉండగా తన ఇంటికి వచ్చి ప్రేమించాలి అని లేకపోతే చంపేస్తానని బెదిరించాడు.

అంతకూ ఆమె లొంగకపోవడంతో అతడు తనతో తెచ్చుకున్న కత్తితో బాధితురాలి మెడ కోసి అక్కడినుంచి పారిపోయాడు. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలించి అతడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి అరె మడుగు తరలించడం జరిగింది.

Related posts

అధికారుల్లా డబ్బు వసూలు చేసిన విలేకరులు

Satyam NEWS

వనపర్తిలో శ్రమదానం చేసిన వైస్ వాకిటి శ్రీధర్

Satyam NEWS

నిన్నటి వరకు రెవిన్యూ.. ఇవాళ్టి నుంచీ పోలీసు శాఖ ఉరుకులు పరుగులు

Satyam NEWS

Leave a Comment