38.2 C
Hyderabad
April 28, 2024 21: 44 PM
Slider విజయనగరం

మందు కొట్టి బైక్ లు న‌డిపిన‌వారిపై కేసులు బుక్ చేస్తున్న పోలీసులు

#vijayanagarampolice

ఇటీవ‌ల త‌ర‌చూ  ప్ర‌మాదాలు జ‌రుగుతుండటంతో వాటి నివార‌ణ‌పై ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలీస్ బాస్ సీరియ‌స్  గానే దృష్టి పెట్టారు.ఈ మేర‌కు ఆయా స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్లు…ట్రాఫిక్ పోలీసులు చ‌లానాలు విదించి భారీఎత్తున జ‌రీమానా విదిస్తున్నారు.అందులో భాగంగా నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించిన వారిని గుర్తించ‌డంతో 961 కేసులు న‌మోదు చేసారు. 

వారి వ‌ద్ద నుంచీ దాదాపు రెండు ల‌క్ష‌ల 22 వేల ,620 సొమ్మును చ‌లానా రూపంలో వ‌సూలు చేయించారు. ఇక జిల్లా ఎస్పీఎం.దీపిక  పర్యవేక్షణ లో  జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది రోడ్డు ప్రమాదాలు, నియంత్రణకు, సారా, మద్యం, నిషేధిత ఖైనీ, గుట్కాలు, గంజాయి, ఇసుక, పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు, కోవిడ్ నిబంధనలు అతిక్రమించిన వారిపైన కఠిన చర్యలు చేపట్టారు.

అలాగే  మద్యం అక్రమ రవాణదారులపై స్థానిక పోలీసులు మరియుఎస్ఈబీ పోలీసులు సంయుక్తంగా జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించి, 12 కేసులు నమోదు చేసి, 8 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి 40 లీటర్ల నాటుసారాను, 7.32 లీటర్ల ఐ.ఎం.ఎల్.ఎఫ్. మద్యంను, 40 కిలోల నల్ల బెల్లంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇక బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజా శాంతికి భంగం కలుస్తున్న వారిపై  26 కేసులను పోలీసులు నమోదు చేశారు.

Related posts

ఎస్ఎల్‌జీ ఆసుప‌త్రితో మ‌హేశ్వ‌ర మెడిక‌ల్ కాలేజి ఒప్పందం

Satyam NEWS

వాల్మీకి బోయలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చాలి

Satyam NEWS

8 ఏళ్లలోనే ప్రజల జీవన శైలిలో మార్పు

Murali Krishna

Leave a Comment