హన్మకొండ రామ్‌నగర్‌లో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. సహ జీవనం చేస్తున్న యువతి గొంతుకోసి పరారయ్యాడు. అనంతరం నిందితుడు షాహిద్ జడ్జి ఎదుట లొంగిపోయాడు. నిందితుడు షాహిద్ ను న్యాయమూర్తి పోలీసులకు అప్పగించారు. మరో వైపు క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. మృతురాలు హారతిగా గుర్తించారు. హారతి షాహిద్ కలిసి ఉంటున్నారు. చాలా కాలం నుంచి సహజీవనం చేస్తున్నారు.
అయితే కొద్దిరోజుల నుంచి హారతి మరొకరితో సఖ్యతగా ఉంటుందట. దాంతో గత కొంతకాలంగా షాహిద్‌కు హారతికి మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రియురాలు హారతి తనను నిర్లక్ష్యం చేస్తోందనే అనుమానంతోనే అతడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.