29.7 C
Hyderabad
May 3, 2024 06: 17 AM
Slider ముఖ్యంశాలు

జనజీవన స్రవంతిలోకి వచ్చే మావోలకు సహకరిస్తాం

#mulugu police

జనజీవన స్రవంతిలోకి వచ్చే మావోయిస్టులకు అన్నివిధాల సహకరిస్తామని  ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ తెలిపారు 

శుక్రవారం తాడ్వాయి మండలం కాల్వపల్లి  లోని  నిషేధిత మావోయిస్టు పార్టీ నేత తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ దామోదర్  తల్లి బడే బతుకమ్మను ములుగు ఎస్పి  కలిసి ధైర్యం చెప్పారు. మొదట ఆయన బతుకమ్మతో మాట్లాడుతూ  కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఎలాంటి సమస్య ఉన్నా తమకు చెప్పాలని అన్నివిధాల సహకరిస్తామని ఎస్పీ తెలిపారు. ఎస్పీ బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు, ఆర్థికసాయాన్ని  అందజేశారు. ఈ సందర్భంగా  ఎస్పీ అజ్ఞాత మావోల ను  ఉద్దేశించి మాట్లాడుతూ వనం నుండి   జనంలోకి రావాలని వారికి అన్ని విధాల సహకరిస్తామని అన్నారు.

అనారోగ్యంతో ఉన్నా మీకు చికిత్స చేయిస్తాం  ఒత్తిడితో అడవుల్లో  ఉండవద్దని అన్నారు. ప్రాణాలతో మీ కుటుంబ సభ్యులను కలవమని అన్నారు.  గత రెండు నెలలుగా మావోయిస్టు నాయకులు కరోనా బారిన పడి  మృత్యువాత పడుతున్నారని  ఎంతోకాలంగా అజ్ఞాతంలో ఉండి  కన్నవారికి తోబుట్టువులకు దూరంగా ఉంటూ  మావోయిస్టు పార్టీ ఒత్తిడితో కొనసాగుతున్నారన్నారు 

ఇప్పటికే ముఖ్యనేతలందరూ అనారోగ్యంతో అడవుల్లో మృతిచెందుతున్న కేంద్ర కమిటీ  దాటవేత ధోరణి ప్రదర్శిస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు  అజ్ఞాతంలో ఉన్న ముఖ్యనేతలకు కిందిస్థాయి  క్యాడర్ కు అన్నివిధాలా సహకరిస్తామని ఎస్పీ ఈ సందర్భంగా అన్నారు. 

ప్రభుత్వం నుండి వారికి అన్ని విధాల సహకరించడంతోపాటు వారి కుటుంబాలకు కూడా అండగా ఉంటామన్నారు అనారోగ్యంతో అడవుల్లో వుండడంకన్నా జనజీవనస్రవంతిలోకి వచ్చి  వారి కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా వారి జీవితం గడపాలని ఎస్పీ ఆకాంక్షించారు.

కార్యక్రమంలో ములుగు ఏఎస్పీ పోతరాజు సాయి చైతన్య  ఎఎస్పి రూపేష్,  సీఐ శ్రీనివాస్ , ఎస్సై వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Related posts

అక్ర‌మ క‌ట్ట‌డాల‌పై ఎమ్మెల్యే ఆగ్ర‌హం….కార్పొరేష‌న్ అధికారుల‌పై కోపం…!

Satyam NEWS

పదవ తరగతి విద్యార్థులకు హాల్ టిక్కెట్లు పంపిణీ

Satyam NEWS

నిజామాబాద్ చౌరాస్తాలో చెప్పుతో కొడతా

Satyam NEWS

Leave a Comment