28.7 C
Hyderabad
May 6, 2024 07: 35 AM
Slider ప్రత్యేకం

ఉల్లి రైతుకు పొంచి ఉన్న ప్రమాదం

onions 13

ఉల్లి డిమాండ్ పెరగడంతో ఉల్లి రైతులు పంటను ముందే కోసేస్తున్నారు. దీంతో ఉల్లి పాయల నాణ్యత తగ్గి వారికి రావాల్సిన ఆదాయానికి గండిపడుతున్నది. సీజన్ ముగిసే సమయానికి, ఉల్లి ధర దేశవ్యాప్తంగా పెరుగుతూనే ఉంది. అదే విధంగా ఉల్లిపాయల సాగు కూడా గత కొన్నేళ్లుగా పెరుగుతూనే ఉంది.

ఉల్లిపాయలను అత్యధికంగా ఉత్పత్తి చేసే ప్రాంతాలలో కర్నూలు జిల్లా ఒకటి. చాలా ఏళ్లుగా ఉల్లి సాగు చేస్తున్నా రైతులు ఈ సంవత్సరం మాత్రమే లాభాలను చూడటం ప్రారంభించారు. అయితే అత్యాశకు పోతున్న రైతులు మరింత ఎక్కువ లాభం ఆర్జించడానికి ఈ సారి వేసిన ఉల్లి ని ముందుగానే కోసేస్తున్నారు.

డిసెంబరు కావడంతో చల్లని వాతావరణం వల్ల ఉల్లిపాయలు పెద్దగా పెరగవు. ఈ కారణంగా మార్కెట్‌కు పంపిన ఉల్లిపాయల నాణ్యత అంతకుముందు అంత మంచిగా ఉండటం లేదు. ఇది ఈ సీజన్ తొలి పంట కావడం వల్ల ముందస్తు కోత వల్ల ఉల్లిపాయలు చిన్నవి గా ఉంటున్నాయి.

అంతేకాక కొంతమంది రైతులు తమ ఉత్పత్తులను కూడా గ్రేడింగ్ చేయడం లేదు. రైతులు తమ ఉత్పత్తులను గ్రేడ్ చేయనందున, కొనుగోలుదారులు కూడా ఆసక్తి చూపడం లేదు. ఇది రైతుల లాభాలను తగ్గిస్తుంది.

Related posts

శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల‌కు అంకురార్ప‌ణ‌

Satyam NEWS

పి‌ఎస్‌ఆర్ ట్రస్ట్ అధ్వర్యంలో ఆటల పోటీలు

Murali Krishna

విశ్వశాంతి

Satyam NEWS

Leave a Comment