39.2 C
Hyderabad
April 30, 2024 21: 23 PM
Slider విజయనగరం

విజయనగరం పోలీసు బ్యారెక్స్ లో “ఓపెన్ హౌస్”

#policebarex

పోలీసు అమరవీరుల దినోత్సవం లో భాగంగా విజయనగరం జిల్లాలో వారం రోజుల పాటు పలు కార్యక్రమాలు రూపొందించింది…జిల్లా శాఖ.ఇందులో భాగంగా విజయనగరం పోలీసు బ్యారెక్స్ లో పలు ఆయుధాలను బహిర్గత పరిచారు. ఈ నేపథ్యంలో పలు పాఠశాల ల విద్యార్థులకు క్విజ్ కార్యక్రమం నిర్వహించారు… సీఐ మురళి, ఎస్ఐ వాసుదేవ్ లు.జిల్లా ఎస్పీ దీపికా ఆదేశాలతో… పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా క్విజ్ పోటీలు నిర్వహించారు.

“ఓపెన్ హోస్” లో..టీచర్ అయిన జిల్లా ఎస్పీ దీపికా….!

దాదాపు 2,వేల మంది సిబ్బంది కి అధిపతిగా ఉన్న విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా ఒక్క సారిగా టీచర్ గా మారిపోయారు..అదేనండీ పాఠాలు చెప్పే ఉపాధ్యాయుని అవతారం ఎత్తారు. అదీ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా. ఈ నెల 21 నుంచే అమరవీరుల సంస్మరణ దినోత్సవాలలో భాగంగా జిల్లా ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలను రూపొందిస్తోంది…పోలీసు శాఖ.అందులో భాగంగానే పోలీసు బ్యారెక్స్ లో “ఓపెన్ హౌస్” నిర్వహించింది…శాఖ.ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసు శాఖలో వినియోగించే ప్రతీ ఆయుధాన్ని…ఈ ఓపెన్ హౌస్ ద్వారా బహిర్గతం చేసారు. పాఠశాలల విద్యార్థుల కు ఏ వెపన్ ఎలా పని చేస్తుందో శాఖా సిబ్బంది వివరిస్తారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ దీపికా… టీచర్  అయి….”ఓపెన్ హౌస్”కు వచ్చిన పిల్లలకు… ఏ వెపన్ ఎలా ఉపయోగిస్తామో…డెమో రూపంలో చూపించారు.

Related posts

మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు

Satyam NEWS

బిచ్కుంద జూనియర్ కళాశాలలో జాబ్ మేళా

Satyam NEWS

ఘనంగా ముఖ్యమంత్రి జగన్ జన్మదినం

Satyam NEWS

Leave a Comment