31.7 C
Hyderabad
May 7, 2024 00: 40 AM
Slider మహబూబ్ నగర్

ప్రత్యేక ఏర్పాట్లతో కొల్లాపూర్ షాపింగ్ కాంప్లెక్స్ ఓపెన్ టెండర్స్

#kollapurmunicipality

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ షాపింగ్ కాంప్లెక్స్ కు  సంబంధించిన ఓపెన్ టెండర్స్ బుధవారం ఉదయం పది గంటలకు ప్రారంభమవుతాయని కొల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి  తెలియజేశారు. మంగళవారం టెండర్స్ చివరి తేదీ ముగియడంతో బుధవారం ఓపెన్ టెండర్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మొత్తం 308 దరఖాస్తులు వచ్చాయి అని తెలియజేశారు. ముందుగా రిజర్వేషన్లకు సంబంధించి  ఓపెన్ టెండర్స్ ఉంటాయన్నారు. రిజర్వేషన్లు టెండర్స్ పొందిన వాళ్లు బయటకు వెళ్తారు. మిగిలిన  జనరల్ కేటగిరిలో  పాల్గొనవచ్చని అన్నారు. ముందుగా వచ్చిన అప్లికేషన్స్  క్యాటగిరివైజ్ గా గోడకు లిస్టు అతికించడం జరుగుతుందన్నారు. లిస్టు లో వున్న నెంబర్ తో ప్లకార్డు ఇస్తారు. కుర్చీలకు నెంబర్స్ ఏర్పాటు చేశారు. ఆ కుర్చీలో  కూర్చొని  ప్ల కార్డు  చూపిస్తూ  టెండర్ లో పాల్గొనాలని చెప్పారు. కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని వాసవి కళ్యాణ మండపం ఉదయం 10 గంటలకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలి అన్నారు. సంబంధించిన గుర్తింపు కార్డులు, పత్రాలు తీసుకుని రావాలన్నారు. సి సి కెమెరాలు, పోలీస్ వారి పహర లో ఓపెన్ టెండర్స్ జరుగుతాయన్నారు.

క్యాటగిరి వైజ్ గా వచ్చిన టెండర్లు ఇలా వున్నాయి

ఎస్. సి….కేటగిరి లో…..63 దరఖాస్తులు…

ఎస్.టి….21 దరఖాస్తులు…

పి.హెచ్.సి…( అంగవైకల్యం) కేటగిరి….27 దరఖాస్తులు…

ఓపెన్ కేటగిరి….197 దరఖాస్తులు…

మొత్తం….308 దరఖాస్తులకు రూ.15,40,000/- రూపాయలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

Related posts

ఆస్తి కోసం ఇద్దరు చిన్నారులను చంపిన సోదరుడు

Satyam NEWS

మహాత్మ పూలేకు నివాళి అర్పించిన నేతలు

Satyam NEWS

4 నుంచి ఇంజినీరింగ్‌ విద్యార్థులకు శిక్షణ

Sub Editor 2

Leave a Comment