31.2 C
Hyderabad
May 3, 2024 00: 57 AM
Slider ఖమ్మం

డిసెంబర్ 2న ప్రజా సమస్యల పై ఖమ్మం లో పాదయాత్ర

#nunna

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని సొంత స్థలం కలిగిన పేదలందరికీ ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 2 న  నగరంలోని అన్ని ప్రాంతాల్లో సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలియజేశారు. సుందరయ్య భవన్ నందు సీపీఎం నగర నాయకులు నర్రా రమేష్  అధ్యక్షుతన జరిగిన సమావేశంలో నున్నా మాట్లాడుతూ నగరంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం కోసం పార్టీ కార్యకర్తలందరూ ప్రజల వద్దకు వెళ్లనున్నట్లు వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం స్కీం లో విఫలం చెందిందని విమర్శించారు. ప్రభుత్వం ప్రజలందరికీ ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి సంవత్సరాలు దాటిన మాటలు నీటిమూటలుగా మారాయని అన్నారు. అన్ని డివిజన్ లో సమగ్రంగా సర్వే నిర్వహించి పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనియెడల సిపిఎం ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు  యర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై విక్రమ్, టూ టౌన్ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్, నాయకులు  హుస్సేన్, భద్రం, కె వెంకన్న , బి రవీంద్ర, పి వాసు, కుమారి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

పల్లెల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించేందుకు జాతీయ లఘు చిత్రాల పోటీ

Satyam NEWS

సంప్రోక్షణ అనంతరం తెరుచుకున్న బాసర ఆలయం

Satyam NEWS

ఆఫ్గనిస్తాన్ లో బాంబు పేలుళ్లు .. ముగ్గురు మృతి

Sub Editor

Leave a Comment