29.7 C
Hyderabad
May 3, 2024 05: 24 AM
Slider కరీంనగర్

రైతుకు ఇబ్బందులు ఉండొద్దనేదే ప్రభుత్వ లక్ష్యం

#ministergangula

రాష్ట్ర వ్యాప్తంగా 3381 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

వేరే ఏ రాష్ట్రంలో తెలంగాణ మాదిరి పంటలు పండటం లేదని, కరెంటు, నీళ్లు, మౌలిక వసతులు లేవని, ఇవన్నీ సమకూర్చే గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటివారు అక్కడ లేరనే అక్కసుతో కండ్లమంటతో పార్టీలు పస లేని ఆరోపణలు చేస్తున్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ పార్టీల మాదిరే కొన్ని ప్రసార మాధ్యమాలు సైతం కొనుగోలు లేటయిందని, గన్నీలు ఉన్నాయా అని రైతుల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని మంత్రి అన్నారు.

కొనుగోలు కేంద్రాలు సజావుగా నడుస్తున్నాయని రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్కరైతు ఇబ్బందులు పడుతున్నామనే పిర్యాదులు రాకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. రైతు కోతలు చేసి కొనుగోలు కేంద్రానికి ఫెయిర్ ఆవరేజ్ క్వాలిటీతో తీసుకురావాలని ఒక్క కిలో కూడా తరుగు పెట్టమన్నారు. గన్నీల లభ్యతపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని మంత్రి గంగుల తిప్పికొట్టారు.

ఎక్కడా గన్నీబ్యాగుల కొరత లేకుండా చేశాం

ఈ యాసంగిలో అవసరమైన గన్నీబ్యాగులు 15కోట్లుగా అంచనా వేసామని ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించే నాటికే మన వద్ద మొత్తం 1కోటి 62 లక్షల 70వేల 611 గన్నీ బ్యాగులున్నాయని, మే 1 నాటికి 4కోట్లు సేకరిస్తామని చెప్పామని కానీ నిన్నటి వరకూ 7కోట్ల 67లక్షల గన్నీ బ్యాగులను సిద్దం చేసుకున్నాం. గన్నీ బ్యాగుల కొరత లేనే లేదన్నారు. ఎక్కడ తక్కువ ఉన్నా తమ దృష్టికి తెస్తే తక్షణం పంపిస్తామన్నారు.

కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం బద్దిపల్లి ,అసిఫ్ నగర్ ,నాగుల మాల్యాల లో DCMS ,iKP ,PACS ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నేడు ఆయన ప్రారంభించి మాట్లాడారు. కొంటున్న ధాన్యాన్ని వెంటవెంటనే రైస్ మిల్లులకు చేర్చి ఓపిఎంఎస్లో గుర్తించాలని అప్పుడే రైతులకు త్వరితంగా నిధుల్ని బదిలీ చేసే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు.

ఇదే సమయంలో ఎఫ్.సి.ఐ పిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపడుతుందని తద్వారా రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలించే ప్రక్రియ నిలిపివేయాల్సి వస్తుందని పీవీకి ఇది సరైన సమయం కానందున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకొని రైతులకు సత్వర సేవలు అందేలా చూడాల్సిన బాధ్యతలు తీసుకోవాలన్నారు. సరైన సమయంలో పీవీ చేయడమే కాకుండా ఎలాంటి అక్రమాలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదన్నారు.

ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా 6812 కొనుగోలు కేంద్రాల అంచనా వేసామని అందులో 3381 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన కోతల సరళితో కొనుగోల్లు జరుపుతున్నామని 49875 మంది రైతుల నుండి 3.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసామని ఇందులో 3.54 లక్షల మెట్రిక్ టన్నులను మిల్లులకు తరలించామని వీటి విలువ 742 కోట్లు అన్నారు.

మిల్లర్లు అక్నాలెడ్జ్ చేసిన వెనువెంటనే రెండు రోజుల్లో డబ్బులు రైతుల అకౌంట్లలో వేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అరకొర పంటలు పండేవని కానీ నేడు భూమికి భరువయ్యేంత పంట పండుతుందన్నారు, దీంతో రైతులు, రాష్ట్రం సంతోషంగా ఉందన్నారు. కరీంనగర్ జిల్లాలో 249 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని 1373 మంది రైతుల నుండి  8600 మెట్రిక్ టన్నులు సేకరించామన్నారు.

Related posts

ప్రొటెస్టు: ప్రభుత్వ చర్యపై అంగన్వాడి కార్యకర్తల నిరసన

Satyam NEWS

దళితబంధు ప్రారంభించక పోతే చర్యలు

Murali Krishna

విజయంతో ఎగిరెగిరి పడుతున్న పాక్.. మంత్రి నోటి దూల

Sub Editor

Leave a Comment