Slider నిజామాబాద్

హసన్ పల్లిలో కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

Hunmanth shinde

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం గునుకుల సహకార సంఘం పరిధిలోని హసన్పల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను జూకల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే ప్రారంభించారు. ముందుగా కార్మికులకు మాస్కులను అందించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సామాజిక దూరం పాటించాలన్నారు.

ప్రతి రైతు వద్ద నున్న ప్రతి విత్తనం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి ఆర్డీఓ రాజేశ్వర్ జిల్లా సహకార సంఘం అధికారిని మమతా తహసీల్దార్ నారాయణ, మాజీ జడ్పి చైర్మన్ దఫేదర్ రాజు సిడిసి చైర్మన్ గంగారెడ్డి పాల్గొన్నారు.

ఇంకా మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు విఠల్  నాయకులు పట్లోళ్ల దుర్గారెడ్డి, తెరాస అధ్యక్షులు సత్యనారాయణ గునుకుల సహకార సంఘం అధ్యక్షులు వాజిద్ అలీ రామచందర్ విట్టల్ మోయిజ్ నర్సింలుతో పాటు ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు తెరాస నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

Related posts

నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్ స్టాన్సెస్ చట్టంపై అవగాహన

Satyam NEWS

గోమాత…హైందవజాతికి మూలాధారం…!

Satyam NEWS

రాహుల్ గాంధీ పట్ల పోలీసుల ప్రవర్తన సరికాదు

Satyam NEWS

Leave a Comment