31.7 C
Hyderabad
May 2, 2024 08: 19 AM
Slider క్రీడలు

కంగారూల చేతిలో పాక్ చిత్తు.. ఆస్ట్రేలియా విజయం

టీ20 వరల్డ్‌ కప్‌లో ఇప్పటి వరకు ఓటమి అంటూ ఎరగని పాకిస్థాన్, కేవలం ఒక ఓటమిని మాత్రమే చవిచూసిన ఆస్ట్రేలియా ఫైనల్‌ పోరులో తలపడ్డాయి. హోరా హోరీగా సాగిన ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ పై ఆస్ట్రేలియా విజయం సాధించింది.

ఓవైపు పాకిస్తాన్‌, మరో వైపు పూర్తిగా ఫాంలో ఉన్న ఆస్ట్రేలియా ఇలా రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో పోటీ రసవత్తరంగా సాగింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన పాక్ నిర్ణిత ఓవర్లలో 175 పరుగులు చేసింది. ఇక 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మొదటి పాక్ బౌలర్ల పై విరుచుకుపడింది.

ఇక ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ మిగిలిఉండగానే ఆస్ట్రేలియా తన లక్ష్యాన్ని ఛేదించింది. దాంతో ఫైనల్ కు చోటు దక్కించుకుంది. వరుసగా వికెట్లు కోల్పోతున్నా ఏమాత్రం తడబడకుండా పోరాడి విజయం సాధించింది ఆస్ట్రేలియా. ఇక ఫైనల్ లో ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ తో తలపడనుంది. చూడాలి ఈసారి కప్ ఎవరికి సొంతం అవుతుందో..

Related posts

సంస్కృతి,సంప్రదాయాలకు తెలంగాణ పెట్టింది పేరు

Satyam NEWS

ఇది మంత్రుల కార్యక్రమమా? టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమమా?

Satyam NEWS

టైం పాస్ క్రైమ్ : ఓ నగ్న మహిళ పోలీసులనే పరేషాన్ చేసింది

Satyam NEWS

Leave a Comment