42.2 C
Hyderabad
April 26, 2024 16: 03 PM
Slider ప్రపంచం

టైం పాస్ క్రైమ్ : ఓ నగ్న మహిళ పోలీసులనే పరేషాన్ చేసింది

bare women police car


అమెరికా లోని అరిజోనాలో ఈ వింత కేసు బయటపడింది. పోలీసులను మోసం చేసి ఓ మహిళ పోలీస్ కారును దొంగిలించింది. పోలీస్ లను ముప్పు తిప్పలు పెట్టి చివరకు కారు పంక్చరు కావడం తో వారికి పట్టుబడింది.
మిర్రర్ నివేదిక ప్రకారం, ఫోన్‌లో ఎవరో ఒకరు బట్టలు లేని ఒక మహిళ రోడ్డు పక్కన నిలబడి ఉన్నారని అరిజోనా పోలీసులకు పిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు పెట్రోల్ స్టేషన్‌కు చేరుకున్నారు, అక్కడ మహిళ బట్టలు లేకుండా నిలబడి ఉంది. పోలీసులు మొదట ఆ మహిళకు తనను తాను కవర్ చేసుకోవటానికి ఒక దుప్పటి ఇచ్చారు, తరువాత వారు ఆ మహిళ ఈ స్థితిలో ఉండటానికి కారణం అడిగారు. తనపై అత్యాచారం జరిగిందని ఆ మహిళ పోలీసులకు తెలిపింది. పోలీసులు ఆమెను ఓదార్చడానికి ముందే, ఆ మహిళ త్వరగా ముందుకు వెళ్లి పోలీసు కారులో కూర్చుంది.

పోలీసులు ఆమెను అర్థం చేసుకోకముందే, ఆమె కారు వేగాన్ని పెంచి గంటకు 100 కి మీ కి పైగా వేగంతో పోలీసు కారును నడుపుతూ అక్కడి నుంచి తప్పించుకుంది. పోలీసు అధికారులకు ఏమీ అర్థం కాలేదు. వారు వెంటనే మరో కారులో ఆమెను వెంబడించడం ప్రారంభించాడు. నగ్నం గా డ్రైవింగ్ చేస్తున్న ఓ మహిళ తన వేగాన్ని మరింత పెంచుకుని పోలీసులను చాలా గంటలు తన వెనుక తిప్పించు కుంది తన కారు చక్రం పంక్చర్ అవడాం తో ఆగిపోయింది .

పోలీసు మహిళను ఆపడానికి అనేక రౌండ్ల రబ్బరు బుల్లెట్ల తో కాల్పులు జరిపారు. మహిళను అరెస్టు చేసి పోలీసులు ఈ ఘటన పై దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

కేంద్ర ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలి

Satyam NEWS

ఆడపిల్ల కుటుంబానికి ప్రభుత్వం భరోసా

Satyam NEWS

జీవితాలు నాశనం చేసే క్రికెట్ బెట్టింగ్ ముఠా

Satyam NEWS

Leave a Comment