37.2 C
Hyderabad
May 6, 2024 14: 51 PM
Slider వరంగల్

ఎక్కడి వారు అక్కడే ఉండేలా చర్యలు తీసుకోవాలి

#Telangana State Boarders

లాక్ డౌన్ ను ప్ర‌జ‌లు పాటించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, వేర్వేరు ప్రాంతాల నుంచి ప్ర‌యాణిస్తున్న వాళ్ళ‌ని ఎక్క‌డిక్క‌డే ఉండేట్ల చూడాలని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆదేశించారు.

జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిర్ని తండ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టు ను ఆయన నేడు ఆక‌స్మిక త‌నిఖీ చేశారు. వాహ‌నాల‌ను త‌నిఖీ చేసి, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ లాక్ డౌన్ కి విఘాతం క‌లిగే చ‌ర్య‌ల‌ను పూర్తిగా అడ్డుకోవాల‌ని పోలీసుల‌ను ఆయన ఆదేశించారు.

ప్ర‌జ‌ల్లో కొంద‌రు ఇష్టానుసారంగా తిరుగుతుండ‌టం, అవ‌న‌స‌ర ప్ర‌యాణాలు, అంద‌రితో క‌లుస్తుండ‌టం వ‌ల్లే క‌రో్నా వైర‌స్ విస్త‌రిస్తున్న‌ద‌ని మంత్రి అన్నారు. ప్ర‌స్తుతం కంట్రోల్ కి వ‌స్త‌న్న క‌రోనాని క‌ట్ట‌డి చేయాలంటే… లాక్ డౌన్ ఇలాగే కొన‌సాగించాల‌ని, ఒకవేళ లాక్ డౌన్ పాటించ‌క‌పోతే, మ‌రికొన్ని రోజుల పాటు లాక్ డౌన్ విధించ‌కోవాల్సిన ప‌రిస్థితులు వ‌స్తాయ‌ని ఆయన అన్నారు. మంత్రి వెంట‌ పాలకుర్తి సిఐ రమేష్ నాయక్, గిరిజన కార్పొరేషన్ మాజీ చైర్మన్ గాంధీ నాయక్ త‌దిత‌రులు ఉన్నారు.

Related posts

గురుకుల విద్యాసంస్థల్లో వర్క్ ఫ్రం హోమ్ అమలు చేయాలి

Satyam NEWS

ఘనంగా మల్లన్న స్వామి కళ్యాణోత్సవం

Satyam NEWS

ఆటో కార్మికులను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆర్ధిక సాయంతో ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment