40.2 C
Hyderabad
May 2, 2024 15: 14 PM
Slider రంగారెడ్డి

మద్యం సిండికేట్ తో చేతులు కలిపిన సబ్ ఇన్ స్పెక్టర్

#CybarabadCPSajjanar

లాక్ డౌన్ సమయంలో మద్యం షాపులు బంద్ చేశారు. మద్యం మత్తులో తెలిసీ తెలియకుండా కరోనా వైరస్ వ్యాప్తికి కారణం అవుతారనేది ఒక కారణం కాగా మద్యపానం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి త్వరగా కరోనా బారిన పడతారు.

ఈ రెండు కారణాలతో మద్యం వద్దురా బాబూ బుద్ధిగా ఉండండి అని చెబుతుంటే చాలా చోట్ల పోలీసులు గట్టి నిఘా వేసి ఉంచారు కూడా. అయితే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాల్మాకుల గ్రామంలో కొందరు రాత్రి వేళల్లో మద్యం షాపు ఓపెన్ చేసి స్టాకు తీసి అమ్ముకుంటున్నారు.

దీన్ని సాధారణంగా అయితే పోలీసులు అడ్డుకోవాలి అయితే శంషాబాద్ రూరల్ పోలీసు ఎస్ ఐ శ్రీధర్ చర్యలు తీసుకోకపోగా వారితో చేతులు కలిపాడు.

దాంతో ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అతడిని సస్పెండ్ చేశారు.

Related posts

రికార్డు స్థాయిలో సామూహిక వివాహాలు చేసిన ఎమ్మెల్యే కోనప్ప

Satyam NEWS

డెకాయిట్లు కూడా చేయని విధంగా వైసీపీ అక్రమాలు

Satyam NEWS

శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ జాగిలాలది కీలకపాత్ర

Satyam NEWS

Leave a Comment