24.7 C
Hyderabad
March 26, 2025 10: 26 AM
Slider నల్గొండ

ఆటో కార్మికులను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆర్ధిక సాయంతో ఆదుకోవాలి

#Roshapathi23

ఆటో కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేసినాయని,నెలకి మూడు నాలుగు మార్లు డీజిల్, పెట్రోల్ ,గ్యాస్ ధరలు పెంచడంతో వీరి జీవన పరిస్థితులు అయోమయంగా తయారైందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి ఆరోపించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కేంద్రం లోని పాత బస్టాండ్ నందు ఆటో కార్మికుల యూనియన్, సిఐటియు అనుబంధం కమిటీ సమావేశంలో పాల్గొన్న రోషపతి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం నెలకు మూడు నాలుగు మార్లు డిజిల్, పెంచటం వలన ఆటో కార్మికుల జీవనోపాధి దెబ్బతిన్నదని అన్నారు.

కరోనా సమయంలో  ప్రైవేట్ ఫైనాన్స్ ఒత్తిడి పెరిగిందని, పలు కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఏర్పడుతుందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు జీరో వడ్డీతో ఋణ సౌకర్యం కల్పించాలని కోరారు.

దీంతో పాటుగా నెలకు 7,500 రూపాయల చొప్పున ఆర్థికంగా పది నెలలు సహకరించి కార్మికులను ఆదుకోవాలని కోరారు.

భారత రాజధాని ఢిల్లీ నగరంలో గత 28 రోజుల నుంచి చేస్తున్న రైతుల ఆందోళనకు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం వారి న్యాయమైన కోరికలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎలక సోమయ్య గౌడ్, ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పిట్ట బాలు,కార్యదర్శి బత్తిని శివ, నాగరాజు, సభ్యులు బిక్షం, గోపి, ఉదయ్, వీరబాబు, జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Related posts

ప్రజలకు ఉపయోగపడే పనులకే ప్రాధాన్యత

Murali Krishna

కేసీఆర్ అవగాహనారాహిత్యం వల్లే ధాన్యం కొనుగోలు సమస్య

Satyam NEWS

రాజధానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్: పేర్లు ఇవిగో

Satyam NEWS

Leave a Comment