37.2 C
Hyderabad
April 26, 2024 19: 05 PM
Slider రంగారెడ్డి

ఇద్దరు ఛోటా దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

#TandoorPolice

మొబైల్ షాపులో, ఆదర్శ్ బ్యాంకులో దొంగతనం కేసుల్లో వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని తాండూరు డిఎస్పీ లక్ష్మీ నారాయణ తెలిపారు.

శుక్రవారం తాండూరు పోలీస్ స్టేషన్లో డిఎస్పీ వివరాలను వెల్లడించారు. ఈ నెల 27న పట్టణంలోని మల్లప్ప మడిగే వద్ద రాథోడ్ హోమ్ సింగ్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు.

అతనిని విచారించగా 10వ తేదీన పట్టణంలోని నెహ్రు గంజ్ మొబైల్ షాప్ కు వెళ్లి షటర్ వెనుక సైడ్ లోని వెంటిలేటర్ తొలగించి షాప్ లోని రూ.16వేలు, 27 ఫోన్లు, ఒక టాబ్ ను దొంగిలించినట్లు అతను ఒప్పుకున్నాడు.

అదే విధంగా ఏప్రిల్ నెలలో పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద ఆదర్శ్ బ్యాంక్ లో కూడా తాను దొంగతనం చేసినట్లు అతడు చెప్పాడు.

ఈ కేసుల్లో రాథోడ్ హోమ్ సింగ్ ను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. అదేవిధంగా గురువారం జరిగిన పుస్తెలతాడు దొంగతనం కేసులో నరేష్ అనే వ్యక్తిని రిమాండ్ కు తరలించినట్లు వివరించారు.

ఈ సమావేశంలో తాండూరు పట్టణ సిఐ రవికుమార్, ఎస్ఐ గిరి, హెడ్ కానీస్టేబుల్ నర్సిములు, తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

బీజేపీలో చేరిన ఎన్ఆర్ఐ బాలా త్రిపురసుందరి

Satyam NEWS

ఇంద్రకీలాద్రిపై వచ్చే నెల 17 నుంచి దసరా ఉత్సవాలు

Satyam NEWS

సంక్రాంతి సందర్భంగా అమరావతిలో ప్రత్యేక నిరసన కార్యక్రమాలు

Satyam NEWS

Leave a Comment